హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

రాజారెడ్డి రాజ్యాంగంలో వేధింపుల పర్వం.. టీడీపీ నేతల అరెస్టుపై లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు

రాజారెడ్డి రాజ్యాంగంలో వేధింపుల పర్వం.. టీడీపీ నేతల అరెస్టుపై లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు

నారా లోకేష్

నారా లోకేష్

జగన్‌ను అభద్రతా భావం వెంటాడుతోందని, టీడీపీ నేతలు ప్రలోభాలకు లొంగితే వైసీపీ కండువా కప్పుతున్నారని, లొంగకపోతే జైలుకు పంపిస్తున్నారంటూ మండిపడ్డారు.

  టీడీపీ నేతల వరుస అరెస్టులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. సీఎం జగన్ 16 నెలల జైలు పక్షి అని, కోట్ల దోపిడీదారుడని, 11 కేసుల్లో ఏ1 నిందితుడు జగన్ అంటూ లోకేశ్ ఆరోపించారు. బీసీ నేత అయిన అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్టు చేసి పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఏడాది పాలనలో చేతగాని ముఖ్యమంత్రి జగన్ అనే విషయం ప్రజలకు అర్థమైందని తెలిపారు. జగన్‌ను అభద్రతా భావం వెంటాడుతోందని, టీడీపీ నేతలు ప్రలోభాలకు లొంగితే వైసీపీ కండువా కప్పుతున్నారని, లొంగకపోతే జైలుకు పంపిస్తున్నారంటూ మండిపడ్డారు.

  అందుకోసమే రాజారెడ్డి రాజ్యాంగంలో వేధింపుల పర్వానికి తేరలేపారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే సీఎం జగన్.. జేసీ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టారని తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ప్రతిపక్ష నేతలపై వేధింపులు, కక్షసాధింపులు చేసేందుకు జగన్ ముఖ్యమంత్రి అయినట్టు ఉందని, జగన్ ప్రభుత్వ టెర్రరిజాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటామని వివరించారు.

  Published by:Anil
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, Nara Lokesh

  ఉత్తమ కథలు