బీజేపీ ఎంపీ కోసం దుబాయ్ వెళ్లిన నారా లోకేష్.. ఏది నిజం?

బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కోసం మాజీ మంత్రి, టీడీపీ నేత లోకేష్ సైతం దుబాయ్ వెళ్లారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. సీఎం రమేష్ బీజేపీలో ఉన్నప్పటికీ చంద్రబాబు ఫ్యామిలీతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారని కొందరు వ్యక్తులు పోస్టులు పెడుతున్నారు.

news18-telugu
Updated: November 24, 2019, 4:02 PM IST
బీజేపీ ఎంపీ కోసం దుబాయ్ వెళ్లిన నారా లోకేష్.. ఏది నిజం?
నారా లోకేష్, సీఎం రమేష్
  • Share this:
ఏపీలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కుమారుడు రిత్విక్ నిశ్చితార్థంపై రాజకీయ దుమారం రేగుతోంది. దుబాయ్‌లో జరుగుతున్న ఈ పెళ్లి వేడుకకు పలువురు వైసీపీ ఎంపీలతో పాటు, టీడీపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలకు ఆహ్వానాలు అందినట్లు సమాచారం. వీరి కోసం సీఎం రమేష్ ప్రత్యేకంగా విమానాలు ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కోసం మాజీ మంత్రి, టీడీపీ నేత లోకేష్ సైతం దుబాయ్ వెళ్లారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. సీఎం రమేష్ బీజేపీలో ఉన్నప్పటికీ చంద్రబాబు ఫ్యామిలీతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారని కొందరు వ్యక్తులు పోస్టులు పెడుతున్నారు.

ఈ ప్రచారంపై స్వయంగా నారా లోకేషే స్పందించారు. అవన్నీ పుకార్లనీ.. తాను దుబాయ్‌కి వెళ్లానన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. తాను 2015లో అమెరికా వెళ్లిన ఫొటోలను వైసీపీ కార్యకర్తలు పోస్ట్ చేసి.. దుబాయ్‌కి వెళ్లినట్లుగా తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారని ట్విటర్ వేదికగా మండిపడ్డారు.


మరోవైపు దుబాయ్‌లో నిశ్చితార్థంతో పాటు పెద్ద ఎత్తున రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం టీడీపీలో 23మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో దాదాపుగా 11మంది టీడీపీ ఎమ్మెల్యేలు దుబాయ్‌లో బీజేపీ పెద్దలతో భేటీ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరికొందరు వైసీపీ నేతలు కూడా బీజేపీకి టచ్‌లో ఉన్నారని.. దుబాయ్ కేంద్రంగా ఏపీ రాజకీయాల్లో భారీ కుదుపు ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.First published: November 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు