Home /News /andhra-pradesh /

NARA LOKESH FIRES ON ANDHRA PRADESH GOVERNMENT AND CM YS JAGAN MOHAN REDDY REGARDING CID NOTICES TO CHANDRABABU NAIDU AK

Nara Lokesh: చంద్రబాబుకు నోటీసులు.. తీవ్రంగా స్పందించిన నారా లోకేశ్

నారా లోకేష్(ఫైల్ ఫోటో)

నారా లోకేష్(ఫైల్ ఫోటో)

Nara Lokesh: అమరావతి భూముల విషయంలో ఇన్‌సైడన్ ట్రేడింగ్ జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని గతంలో కోర్టులు స్పష్టం చేశాయని లోకేశ్ అన్నారు.

    ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడంపై ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఇలాంటి వాటితో చంద్రబాబు తెల్లగడ్డం మీదున్న తెల్లని వెంట్రుకల్లో ఒక్కటి కూడా పీకలేరని మండిపడ్డారు. అమరావతి భూముల విషయంలో ఇన్‌సైడన్ ట్రేడింగ్ జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని గతంలో కోర్టులు స్పష్టం చేశాయని లోకేశ్ అన్నారు. అయినా సీఎం జగన్ తాను పట్టిన కుందేళ్ళకు మూడే కాళ్ళు అని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఈ కేసులో 21 నెలలపాటు శోధించి శోధించి అలసిపోయిన సీఎం జగన్.. చివరకు ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారని విమర్శించారు. సీఎం జగన్ అమరావతిని ముక్కలు చేయడానికి ఎన్నో కుట్రలు చేస్తున్నారని.. అయినా అమరావతిని కాపాడుకుని తీరుతామని అన్నారు.

    అంతకుముందు చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రాజధాని అమరావతి భూముల అక్రమాలపై నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన అధికారులు ఆయనకు నోటీసులు అందజేశారు. రాజధాని భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేటింగ్ ఆరోపణలపై విచారణలో భాగంగా చంద్రబాబుకు 41 సీఆర్పీసీ కింద నోటీలిచ్చారు. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ స్వయంగా చంద్రబాబు నివాసానికి వెళ్లినట్లు తెలుస్తోంది. రాజధాని భూముల్లో అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తొలి నుంచి ఆరోపిస్తోంది. రాజధాని ప్రకటనకు ముందుగానే చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు, వారి బంధువులు అమరావతి ప్రాంతంలో భారీగా భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపిస్తోంది. ఈ క్రమంలో సీఐడీ విచారణకు ఆదేశించింది.

    దీనిపై దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ.. చంద్రబాబుతో పాటు పలువురు నేతలకు నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరుకావాల్సిందిగా సీఐడీ తన నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 23న విచారణకు రావాల్సిందిగా సీఐడీ నోటీసులో ఉంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Chandrababu naidu, Nara Lokesh, Tdp

    తదుపరి వార్తలు