సాక్షిపై పరువు నష్టం దావా వేసిన లోకేష్.. ఏకంగా రూ.75 కోట్లా..

తనపై తప్పుడు కథనాలను ప్రసారం, తప్పుడు వార్తలను ప్రచురించి చేసి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని లోకేష్ పేర్కొన్నారు. సాక్షి మీడియా ఉద్దేశపూర్వంగా తప్పుడు వార్తలు రాస్తోందని తెలిపారు.


Updated: January 25, 2020, 9:20 PM IST
సాక్షిపై పరువు నష్టం దావా వేసిన లోకేష్.. ఏకంగా రూ.75 కోట్లా..
నారా లోకేష్
  • Share this:
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ సాక్షి మీడియా హౌస్‌పై పరువును నష్టం దావా వేశారు. విశాఖపట్టణం 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో రూ.75కోట్లుకు దావా దాఖలు చేశారు. ఒరిజినల్ సూట్ 6/2020 నెంబరుతో ఈ వాజ్యం దాఖలైంది. సాక్షి టీవీ ఛానెల్, పత్రిక, వెబ్‌సైట్ తనపై తప్పుడు కథనాలను ప్రసారం, తప్పుడు వార్తలను ప్రచురించి చేసి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని లోకేష్ పేర్కొన్నారు. సాక్షి మీడియా ఉద్దేశపూర్వంగా తప్పుడు వార్తలు రాస్తోందని తెలిపారు. కాగా, 2019 అక్టోబ‌ర్ 22న సాక్షి దినపత్రికలో ‘చినబాబు చిరుతిండి రూ.25 ల‌క్షలండి’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్ సాక్షి మీడియాపై పరువునష్టం దావా దాఖలు చేశారు. దానిపై అప్పట్లోనే మండిపడ్డారు లోకేష్. మతి, నీతిలేని కథనాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఐతే సాక్షిపై ఏకంగా రూ.75 కోట్లకు పరువు నష్టం దావా వేయడం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశమైంది.

Published by: Shiva Kumar Addula
First published: January 25, 2020, 9:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading