Home /News /andhra-pradesh /

NARA LOKESH DEMAND TO AP CM YS JAGAN MOHAN REDDY ON LOCKDOWN AND CORONA VIRUS AK

లాక్ డౌన్ పొడిగింపు... జగన్‌కు లోకేశ్ సరికొత్త డిమాండ్

నారా లోకేష్, వైఎస్ జగన్

నారా లోకేష్, వైఎస్ జగన్

లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలను ఏపీ ప్రభుత్వమే ఆదుకోవాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.

    లాక్ డౌన్ తో పేద ప్రజలు అల్లాడుతున్నారని టీడీపీ యువనేత, మాజీమంత్రి నారా లోకేశ్ అన్నారు. లాక్ డౌన్ పొడిగింపు వార్తలు వారిని మరింత ఆందోళనలోకి నెడుతున్నాయని వ్యాఖ్యానించారు. పనులు లేక, తినడానికి తిండి లేక, పేదలు ఎక్కడకి కదలలేని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పు పుట్టే అవకాశం కూడా లేదు.సమస్యల సుడిగుండంలో ఇరుక్కున్న పేద కుటుంబాలను ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదుకోవాలని అన్నారు. వారికి తక్షణమే రూ. 5 వేల రూపాయిల ఆర్థిక సహాయం అందించి వారిని ఆదుకోవాలని కోరారు. రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయన్న లోకేశ్...మద్దతు ధర రవాణా సౌకర్యం లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.



    లాక్ డౌన్ దెబ్బకి పండిన పంట పొలాల్లోనే వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలు రైతుల నడ్డి విరుస్తున్నాయి.లాక్ డౌన్,అకాల వర్షాల కారణంగా వివిధ జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని ప్రభుత్వం వెంటనే అంచనా వెయ్యాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్ట పరిహారాన్ని ప్రభుత్వం తక్షణమే ఇచ్చి వారిలో ధైర్యాన్ని నింపాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Lockdown, Nara Lokesh

    తదుపరి వార్తలు