నారా చంద్రబాబునాయుడు కుటుంబం ఆస్తులు, అప్పుల వివరాలను నారా లోకేష్ ప్రకటించారు. గత తొమ్మిది సంవత్సరాల నుంచి తాము ఆస్తులను ప్రకటిస్తున్నామని నారా లోకేష్ తెలిపారు. విజయవాడలో జరిగిన సమావేశంలో ఆయన చంద్రబాబు కుటుంబ ఆస్తుల వివరాలను తెలియజేశారు. నారా లోకేష్ చెప్పిన దాని ప్రకారం.. చంద్రబాబు కుటుంబం మొత్తం ఆస్తులు రూ.119.42 కోట్లు. అలాగే, మొత్తం అప్పులు కలిపి రూ.26.04 కోట్లుగా ప్రకటించారు. మొత్తంగా చూస్తే ఆస్తుల్లో నుంచి అప్పులు మినహాయించగా, వారి నికర ఆస్తుల విలువ రూ.93.38 కోట్లుగా తెలిపారు. దీనికి నిర్వాణ హోల్డింగ్స్ సంస్థ ఆస్తులు అదనం.
చంద్రబాబు ఆస్తులు
మొత్తం ఆస్తులు రూ.9కోట్లు
మొత్తం అప్పులు రూ.5.13 కోట్లు
నికర ఆస్తులు రూ.3.87కోట్లు
గత ఏడాదితో పోలిస్తే రూ.87లక్షల పెరుగుదల (నికర ఆస్తిలో)
బ్యాంక్ లోన్ రూ.18లక్షలు తగ్గింది.
నారా భువనేశ్వరి ఆస్తులు
మొత్తం ఆస్తులు రూ.50.62 కోట్లు
మొత్తం అప్పులు రూ.11.04 కోట్లు
నికర ఆస్తులు రూ.39.58 కోట్లు
గత ఏడాదితో పోలిస్తే రూ.8.50కోట్లు పెరుగుదల (నికర ఆస్తిలో)
నారా లోకేష్ ఆస్తులు
మొత్తం ఆస్తులు రూ.24.70 కోట్లు
మొత్తం అప్పులు రూ.5.70 కోట్లు
నికర ఆస్తులు రూ.19 కోట్లు
గత ఏడాదితో పోలిస్తే రూ.2.40 కోట్లు తగ్గుదల (నికర ఆస్తిలో)
నారా బ్రాహ్మణి ఆస్తులు
మొత్తం ఆస్తులు రూ.15.68 కోట్లు
మొత్తం అప్పులు రూ.4.17 కోట్లు
నికర ఆస్తులు రూ.11.51 కోట్లు
గత ఏడాదితో పోలిస్తే రూ. 3.80 కోట్లు పెరుగుదల (నికర ఆస్తిలో)
నారా దేవాన్ష్ ఆస్తులు
మొత్తం ఆస్తులు రూ.19.42 కోట్లు
గత ఏడాదితో పోలిస్తే రూ.71లక్షల పెరుగుదల (నికర ఆస్తిలో)
నారా దేవాన్ష్‌కు చంద్రబాబు హెరిటేజ్‌లో తన వాటాలో ఉన్న 26440 షేర్లను గిఫ్ట్ ఇచ్చారు.
నిర్వాణ హోల్డింగ్స్ (చంద్రబాబు కుటుంబ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ)
మొత్తం అప్పులు రూ.37.20 కోట్లు అప్పులు ఉండేవి. రూ.34.85 కోట్లకు తగ్గుదల
నికర ఆస్తులు రూ.9.10 కోట్లు
గత ఏడాదిలో రూ.2.27 కోట్లు పెరుగుదల (నికర ఆస్తిలో)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chandrababu naidu, Nara Bhuvaneshwari, Nara Brahmani, Nara Lokesh