Home /News /andhra-pradesh /

NARA LOKESH COMMENTS ON YS JAGAN WITH J TAX UMG

J Tax పేరుతో వ్యాపారులు బెంబేలు.. జగన్ టార్గెట్‌గా లోకేష్ కామెంట్స్

వ్యాపారుల సమావేశంలో మాట్లాడుతున్న నారా లోకేశ్

వ్యాపారుల సమావేశంలో మాట్లాడుతున్న నారా లోకేశ్

జగన్ (YS Jagan) ప్రభుత్వంలో ప్రతి వ్యాపారస్థుడిని టాక్స్‌ (Tax)ల రూపంలో వీర బాదుడు బాదుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) విమర్శించారు. చెత్త పన్ను, బాత్రూమ్ ట్యాక్స్, బోర్డ్ పన్నంటూ వ్యాపారులపై జే ట్యాక్స్ పేరుతో దోచుకుంటున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరి సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India
    జగన్ (YS Jagan) ప్రభుత్వంలో ప్రతి వ్యాపారస్థుడిని టాక్స్‌ (Tax)ల రూపంలో వీర బాదుడు బాదుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) విమర్శించారు. చెత్త పన్ను, బాత్రూమ్ ట్యాక్స్, బోర్డ్ పన్నంటూ వ్యాపారులపై జే ట్యాక్స్ పేరుతో దోచుకుంటున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరి సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. విజయవాడలో నిర్వహించిన టీడీపీ వాణిజ్య విభాగం కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యలు చేశారు.

    ఆంధ్రప్రదేశ్ వ్యాపారులతో నారా లోకేష్ బుధవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యాపారస్థుడికి జరుగుతున్న నష్టాన్ని వివరిస్తూ కరపత్రం విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమానికి లోకేష్‌తో పాటు మాజీ మంత్రి నెట్టెం రఘురాం, బొండా ఉమా, ఎమ్మెల్యే గద్దె రమ్మోహన్, నాగులు మీరా తదితర నేతలు హాజరయ్యారు.

    ఇదీ చదవండి: బాలయ్యా.. బావ బొమ్మేదయ్యా..! 'ఎన్టీఆర్ ఆరోగ్య రథం'పై కనిపించని చంద్రబాబు ఫొటో..


    ఈ సందర్భంగా వ్యాపారస్థుడికి వీర బాదుడు రూపేణ చెత్త పన్ను భారం, బాత్రూం టాక్స్ భారం, బోర్డ్ పన్ను భారం వంటి సమస్యలపై ప్రధానంగా చర్చించారు. ఆక్వా రంగం కుదేలు, ఇసుక పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం కుప్పకూలిపోవడం, రేషన్ డీలర్ వ్యవస్థ నాశనం కావడానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయాలే కారణమంటూ లోకేశ్ విమర్శలు చేశారు. జే టాక్స్ పేరుతో వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారని, ఆటోనగర్‌లపై ప్రతాపం చూపిస్తున్నారని. పవర్ హాలిడేతో పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు. ఏఎల్‌డీ, ఏసీడీ పేరుతో కరెంట్ మీటర్‌పై బాదుడు, ఉన్న పరిశ్రమలు పోయి కొత్త పరిశ్రమలు రాని పరిస్థితులు వచ్చాయంటూ అక్కడికి వచ్చిన వ్యాపారులు లోకేష్‌కు తమ సమస్యలు తెలిపారు.

    తెనాలికి చెందిన వ్యాపరస్తుడు నూనె రామకృష్ణ మాట్లాడుతూ.. 'ముప్పై ఏళ్ల నుంచి నేను టెక్సైటైల్స బిజినెస్‌లో ఉన్నాను. వైఎస్సార్‌సీపీ నాయకుడి ఇంటికి రోడ్డు వేసుకోవడానికి నా షాపు కూలగొట్టారు. అన్ని అనుమతులు ఉన్నా పాత భవనం అని మునిసిపల్ అధికారులు కూల్చేశారు. ఆ సమయంలో టీడీపీ నాయకులు నాకు అండగా నిలిచారు. న్యాయ పోరాటం చేస్తున్న నన్ను మునిసిపల్ అధికారులు, పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారు. ఒక్క తెనాలిలోనే ఇలాంటి ఘటనలు ఎనిమిది జరిగాయి' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
    Published by:Mahesh
    First published:

    Tags: AP Politics, Nara Lokesh, Vijayawada, Ys jagan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు