హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Lokesh on Pawan: పవన్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసిన లోకేష్.. పొత్తులపై క్లారిటీ ఇచ్చినట్టేనా..?

Lokesh on Pawan: పవన్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసిన లోకేష్.. పొత్తులపై క్లారిటీ ఇచ్చినట్టేనా..?

నారా లోకేష్ (ఫైల్ ఫోటో)

నారా లోకేష్ (ఫైల్ ఫోటో)

Nara Lokesh on Pawan: పవన్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేశారు నారా లోకేష్.. పాదయాత్ర తొలి రోజే.. పవన్ పేరు ను ప్రస్తావించి.. పొత్తులపై క్లారిటీ ఇచ్చారా..? అసలు లోకేష్ ఏమన్నారంటే?

  • News18 Telugu
  • Last Updated :
  • Kuppam, India

Nara Lokesh on Pawan:  తెలుగు దేశం (Telugu Desam) యువ నేత నారా లోకేష్ (Nara Lokesh) పాద యాత్ర ఊహించినట్టే  సాగుతోంది. వైసీపీ (YCP) చేసిన తప్పులను ప్రజలకు తెలియచేయడమే లక్ష్యంగా ఆయన పాదయాత్ర కొనసాగుతోంది. తొలి రోజు ప్రసంగంలోనే వైసీపీ తీరుపై తీవ్ర స్థాయిలో నిప్పులు  చెరిగారు. అంతేకాదు వపన్ కళ్యాణ్  (Pawan Kalyan) ఫ్యాన్స్ ను కూడా ఖుషి చేశారు.. తన పాదయాత్రకు అడ్డంకులు కలిగిస్తున్నారని.. మండిపడుతూనే పవన్ పేరును ప్రస్తావించారు.  పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతుందని.. పవన్ ఆపేది ఎవరు అని ప్రశ్నించారు.. సందర్భం లేకున్నా.. పవన్ పేరును పలికారు.. అంటే పవన్ తో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని లోకేస్ నేరుగా పాదయాత్రలోనే సిగ్నల్ ఇచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం ఏపీలో పొత్తులపై సందిగ్ధత నెలకొంది. అందుకు కారణం పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలే.. ఒక్కోసారి ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలం అని గట్టిగా చెబుతారు.. అక్కడితోనే ఆగకుండా.. సింగిల్ గా వెళ్లి వీరమరణం పొందడం కంటే.. పొత్తులతో వెళ్లి నెగ్గడమే బెటర్ అంటూ ... టీడీపీతో పొత్తు ఉందనే సంకేతాలు ఇస్తారు..

కానీ ఇటీవల పవన్ వ్యాఖ్యలు మళ్లీ సందిగ్ధతను పెంచాయి. ఇటీవల విజయవాడలో మాట్లాడిన పవన్ మూడు ఆప్షన్లు చెప్పారు. ప్రస్తుతం బీజేపీతోనే పొత్తులో ఉన్నాం అన్నారు.. బీజేపీ కుదరదు అంటే ఒంటరిగా వెళ్తామని.. లేదా కొత్త పెట్టుకుంటామన్నారు.. అంతేకాదు ఎన్నికలకు వారం ముందు వరకు పొత్తులపై ప్రకటన ఉండదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : యువతకు ప్రత్యేక మానిఫెస్టో.. యువగళం తొలి రోజు లోకేష్ హామీ ఇదే..?

ఇలా పవన్ రోజుకో మాట మాట్లాడుతుండడంతో టీడీపీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. అయితే పొత్తులపై క్లారిటీ వచ్చాక లోకేష్ పాదయాత్ర మొదలైతే.. అభ్యర్థులను ప్రకటించడం ఈజీ అయ్యేది.. కానీ ఇప్పుడు పొత్తు ఉంటుందో.. ఉండదో తెలియని పరిస్థితి నెలకొంది.. అందుకే తమ వైపు నుంచి ముందే ఓ క్లారిటీ ఇచ్చేస్తే.. పవన్ పొత్తులకు ముందుకు వస్తారని లోకేష్ భావించి  ఉంటారని.. అందుకే ఇలా పవన్ పేరును ప్రస్తావించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

లోకేష్ వైపు నుంచి సంకేతాలు అందడంతో.. పవన్ కూడా ఓ అడుగు ముందుకు వేస్తారేమో చూడాలి.. అదే జరిగితే పొత్తులపై త్వరలోనే అధికారిక ప్రకటన ఉండే వకాశం ఉంది. అయితే ఇటు టీడీపీ నేతలు కానీ.. అటు జనసేన నేతలు కానీ.. త్వరగా పొత్తులపై ప్రకటన చేయాలని కోరుకుంటున్నారు. మరోవైపు జనసేన, టీడీపీలో చేరాలి అనుకుంటున్న ఇతర పార్టీల నేతలు కూడా పొత్తులపై క్లారిటీ రాకపోవడంతో.. వెనుకడుగు వేసే పరిస్థితి కనిపించడం లేదు..

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Nara Lokesh, Pawan kalyan

ఉత్తమ కథలు