హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

జగన్ అలాంటి రకం... అవి ఎలా వచ్చాయన్న నారా లోకేశ్

జగన్ అలాంటి రకం... అవి ఎలా వచ్చాయన్న నారా లోకేశ్

నారా లోకేష్, వైఎస్ జగన్

నారా లోకేష్, వైఎస్ జగన్

కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న 5 కేజీలు ఉచిత బియ్యం, ఒక కేజీ కందిపప్పు ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ఒక్కరికీ ఇవ్వలేదని నారా లోకేశ్ అన్నారు.

    ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ యువనేత, మాజీమంత్రి నారా లోకేశ్ తనదైన స్టయిల్లో సెటైర్లు వేశారు. సీఎం జగన్ జగన్ మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు.. మా ఇంటికొస్తే ఏం తెస్తారనుకునే రకమని ఆయన విమర్శించారు. కరోనా నేపథ్యంలో కేంద్రం చేస్తున్న సహాయం తాను చేస్తున్నట్టు బిల్డ్ అప్ ఇవ్వడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సాయమేమీ లేదని లోకేష్ ఆరోపించారు. ఆయనకు కాంట్రాక్టర్ల పై ఉన్న ప్రేమ ప్రజలు, రైతులు, డాక్టర్లు, ఉద్యోగస్తులపై లేకపోవడం బాధాకరమని లోకేశ్ అన్నారు. గత ఏడాది కంటే 30 వేల కోట్లు అధిక ఆదాయం ఉన్నా... డాక్టర్ల కు ఇచ్చే మాస్కులు, ఉద్యోగస్తుల జీతాల నుండి ప్రజలకు అందించే సహాయం వరకూ కోతలు పెడుతున్నారని లోకేశ్ విమర్శించారు.

    కాంట్రాక్టర్లపై కురిపించిన 6,400 కోట్లు ఆకాశం నుండి ఊడిపడ్డాయా? అని లోకేశ్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న 5 కేజీలు ఉచిత బియ్యం, ఒక కేజీ కందిపప్పు ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ఒక్కరికీ ఇవ్వలేదని నారా లోకేశ్ అన్నారు. ఇతర రాష్ట్రాల్లో కొన్ని చోట్ల 16 రకాల నిత్యావసరాలు ఉచితంగా ఇచ్చారని అన్నారు. సర్వం కోల్పోయిన ప్రజలకు కొన్ని రాష్ట్రాల్లో ఐదు వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారని.. సీఎం జగన్ మాత్రం బీద అరుపులతో సరిపెడుతున్నారని లోకేశ్ మండిపడ్డారు.

    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Coronavirus, Covid-19, Nara Lokesh

    ఉత్తమ కథలు