హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nara Lokesh: టీటీడీకి భారీ విరాళం ఇచ్చిన నారా లోకేశ్, బ్రాహ్మణి..!

Nara Lokesh: టీటీడీకి భారీ విరాళం ఇచ్చిన నారా లోకేశ్, బ్రాహ్మణి..!

నారా లోకేష్

నారా లోకేష్

తాజాగా  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, బ్రాహ్మణిల ముద్దుల తనయుడు నారా దేవాన్ష్ పుట్టినరోజు ఇవాళ జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా నారా లోకేశ్, బ్రాహ్మణి తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం ప్రకటించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Tirumala, India

కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని నిత్యం వేలాది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. వివిధ రాష్ట్రాలకు చెందిన  భక్తులు భారీ విరాళాలను కూడా స్వామివారికి అందచేస్తూ ఉంటారు. తాజాగా  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, బ్రాహ్మణిల ముద్దుల తనయుడు నారా దేవాన్ష్ పుట్టినరోజు ఇవాళ జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా నారా లోకేశ్, బ్రాహ్మణి తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం ప్రకటించారు.

తిరుమల కొండపై ఒకరోజు అన్న ప్రసాద వితరణ కోసం రూ.33 లక్షలను టీటీడీ అధికారులకు విరాళంగా అందజేశారు.ఇది భారీ డొనేషన్ కావడంతో తిరుమలలో ఎలక్ట్రానిక్ డిస్ ప్లే స్క్రీన్లపై దీన్ని ప్రదర్శించారు. దేవాన్ష్ ప్రతి పుట్టినరోజుకు టీటీడీ అన్న ప్రసాద వితరణ కోసం లోకేశ్ కుటుంబం భారీ విరాళం ప్రకటించడం ఆనవాయతీగా వస్తోంది.

First published:

Tags: Local News, Nara Lokesh, Tirumala Temple, Ttd news

ఉత్తమ కథలు