NARA CHANDRABABU NAIDU TO GET CORONA VACCINE BEFORE AP CM JS JAGAN AND JANASENA CHIEF PAWAN KALYAN HERE ARE THE DETAILS PRN
Andhra Pradesh: ఒకే టీమ్ లో జగన్, పవన్... చంద్రబాబు, పెద్దిరెడ్డి సేమ్ క్లబ్... అసలు స్టోరీ ఇదే...
వైఎస్ జగన్, పవన్ కల్యాణ్, చంద్రబాబు (ఫైల్)
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ (Corona Vaccine) ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 1 నుంచి పబ్లిక్ డొమైన్స్ లో వ్యాక్సిన్ విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం (Government of India) ఏర్పాట్లు చేసింది.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 1 నుంచి పబ్లిక్ డొమైన్స్ లో వ్యాక్సిన్ విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వాస్పత్రిలో ఉచితంగా, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ధర రూ.250గా నిర్ణయించింది. ప్రస్తుతానికి 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు దాడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి టీకా వేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో 60 ఏళ్లు నిండిన వారంతా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. కొన్నిచోట్ల అపోహలతో టీకా వేయించుకునేందుకు వెనకాడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. మోదీ వయసు 70ఏళ్లుండటంతో సోమవారం తెల్లవారుజామునే ఎయిమ్స్ కి వెళ్లి వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోం మంత్రి అమిత్ షా కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వ్యాక్సిన్ వేయించుకునే సెలబ్రిటీలు, లీడర్లపై చర్చ జరుగుతోంది. ఈ లిస్టులో జగన్ కంటే చంద్రబాబే ముందున్నారు. ప్రస్తుతం చంద్రబాబు వయసు 70ఏళ్లు దీంతో వ్యాక్సినేషన్ కు ఆయన ఎలిజిబిలిటీ సాధించారు. ఆయన కోవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వ్యాక్సిన్ వేయించుకునే ఛాన్సుంది. దీంతో చంద్రబాబు ఎప్పుడు వ్యాక్సిన్ వేయించుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు సీఎం జగన్ వయసు ప్రస్తుతం 48 ఏళ్లు దీంతో ఈ విడతలో జగన్ వ్యాక్సిన్ వేయించుకునే ఛాన్స్ లేదు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా సీఎంతో పాటే ఉన్నారు. ఆయన వయసు 49 ఏళ్లు కావడంతో జనసేనాని కూడా వెయిటింగ్ లిస్టులో ఉన్నట్లే. వీరితో పాటు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు కూడా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు సీనియర్ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ లాంటి నేతలంతా ఒకే క్లబ్ లో ఉన్నారు. వీరంతా 60 ప్లస్ కావడంతో వ్యాక్సినేషన్ కు రెడీగా ఉన్నారు. ఇక చంద్రబాబు క్లాస్ మేట్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూడా వ్యాక్సిన్ కోసం క్యూ లైన్లో ఉన్నారు. పార్టీ ఏదైనా.. సిద్ధాంతం ఏదైనా.. వ్యాక్సిన్ వేసుకోవాల్సిన వయసులో మాత్రం వీరంతా ఒకే క్లబ్ లో ఉన్నారు.
ఇక టాలీవుడ్ హీరోల విషయానికి వస్తే టాలీవుడ్ టాప్ స్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అంతా అరవై దాటిన వారే వీరు కూడా తర్వలో వ్యాక్సిన్ తీసుకోబోతున్నారు. రాజకీయ నాయకులు, హీరోలు వ్యాక్సిన్ తీకుసోవడం వల్ల ప్రజల్లో ఉన్న అపోహలు పోతాయని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 550 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.