Home /News /andhra-pradesh /

NARA CHANDRABABU NAIDU AND LOKESH WANT GO WITH PEOPLE THEY NOT ATTENDING ASSEMBLY SESSIONS NGS

AP Assembly: ఇకపై నేరుగా ప్రజల్లోకి చంద్రబాబు, లోకేష్.. అసెంబ్లీకి దూరం.. పొలిట్ బ్యూరో కీలక నిర్ణయాలు

లోకేశ్, చంద్రబాబు (ఫైల్ ఫోటో)

లోకేశ్, చంద్రబాబు (ఫైల్ ఫోటో)

AP Assembly: తెలుగు దేశం పార్టీ పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లింది. ముందస్తు ఎన్నికలు ఉన్నా లేకున్నా.. ఇకపై ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించింది. దీంతో పాటు.. ఏడవ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలు కూడా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది.

ఇంకా చదవండి ...
    AP Assembly Session:  ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో అప్పుడే ఎన్నికల హీట్ కనిపిస్తోంది. రెండేళ్లకు ముందే అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ (TDP) అయితే ముందస్తు ఎన్నికలవు తప్పవు అంటోంది. అందుకే ముందస్తు వ్యూహాలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా ఇకపై ప్రజల్లోనే ఉండాలని టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత  చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బస్సు యాత్ర, నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే ఎప్పటి నుంచి ప్రారంభించాలి..? ఎక్కడ నుంచి ప్రారంభించాలి.. మొత్తం రూట్ మ్యాప్ పై త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికలకు ఒక ఏడాది ముందు నుంచే ప్రజల్లో ఉండాలని భావిస్తున్నట్టు సమాచారం. అలాగే ఈ నెల ఏడో తేదీ నుంచి జరిగే ఏపీ అసెంబ్లీ స‌మావేశాలకు కూడా దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.

    ఈ నెల 7వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ స‌మావేశాల్లోనే వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది సర్కార్.. అయితే అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోనే శపథం చేశారు. మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే సభలో అడుగుపెడతాను అంటూ చెప్పారు. ఆ తరువాత బయటకు వచ్చిన ఆయన.. సభలో తన భార్యను సైతం అవమానించారని ఆవేదన వ్యక్తం చేస్తున్న కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన లేకుండా మిగిలిన నేతలు కూడా సమావేశాలు హాజరవ్వడం కరెక్టు కాదని టీడీపీ భావిస్తోంది..

    ఇదీ చదవండి : వైసీపీకి నాగబాబు సలహా.. ఇదే ఫైనల్ అనుకోండి అన్న మెగా బ్రదర్

    దీంతో ఇవాళ సమావేశమైన టీడీపీ పొలిట్ బ్యూరో.. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదనే నిర్ణయానికి వచ్చింది. అయితే  టీడీఎల్పీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. పొలిట్‌బ్యూర్‌ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన పార్టీ నేత కాలువ శ్రీనివాసులు.. కౌరవ సభను తలపించేలా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించే అవకాశం లేకుండా.. మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు.. వైసీపీ ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలుగా మారారని మండిపడ్డారు.

    ఇదీ చదవండి : చెప్పే వాడికి చేసే వాడు లోకువ.. హైకోర్టు తీర్పుపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

    వీటితో పాటు.. ఏడాది పాటు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించినట్టు తెలిపారు కాలువ శ్రీనివాసులు.. 40 ఏళ్ల ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను హైదరాబాద్‌లో.. మహానాడును విజయవాడలో జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక, వైఎస్‌ వివేకా హత్య కేసులో కట్టు కథలు అల్లుతున్నారని ఆరోపించారు శ్రీనివాసులు.. అసలు సూత్రధారులను త్వరగా అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు. 35 సంక్షేమ పథకాలను రద్దు చేసి.. పేదలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో 12 వేల కోట్ల పథకాలు ఆగిపోయాయని విమర్శించారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Nara Lokesh, TDP

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు