Nara Bhuvaneshwari: ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఓ వైపు ఏపీలో వరదల (AP floods)పై విపక్షాలు ఆందోళన బాట పడితే. మరో వైపు నారా భువనేశ్వరి (Nara bhuvaneswari) అంశం రచ్చరచ్చ చేస్తోంది. ఇటీవల ఏపీ అసెంబ్లీ (AP assembly) సమావేశాల్లో తన భార్యను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు నాయుడు (nara chandrababu naidu) ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాలో సమావేశంలో మాట్లాడుతూనే వైసీపీ (ycp) తీరుతో ఆవేదనకు గురైన ఆయన వెక్కి వెక్కి ఏడ్చారు. దీంతో నారా కుటుంబానికి అండగా సినిమా ఇండస్ట్రీ, నందమూరి కుటుంబం, ఇతర ప్రముఖులు అంతా మద్దతుగా నిలిచారు. అయితే ఈ ఘటనపై ఇప్పటి వరకు అందరూ స్పందించారు కానీ.. నారా భువనేశ్వరి నేరుగా ఎక్కడా ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. తాజాగా ఆమె అసెంబ్లీ ఘటనపై తొలిసారి స్పందించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఆమె ప్రత్యేకంగా ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇతరుల వ్యక్తిత్వాన్ని ఎవరూ కించ పరచవద్దని హితవు పలికారు. ఇతరుల గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించ కూడదని భువనేశ్వరి తన ప్రకటనలో కోరారు. ఆమె లేఖలో ఏం రాశారు అంటే.. ఆంధ్రప్రదేశ్ శాసన సభలో తనపై అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తంచేసిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. తనకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి, తోబుట్టువుకు, కూతురికి జరిగినట్టుగా భావించి అండగా నిలబడటం తన జీవితంలో మరిచిపోలేను అన్నారు.
చిన్నతనం నుంచి అమ్మగారు, నాన్నగారు మమ్మల్ని విలువలతో పెంచారు. నేటికీ మేము వాటిని పాటిస్తున్నామని వివరణ ఇచ్చారు. కష్టాల్లో లేదా ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడాలి. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని సూచించారు. తనకు జరిగిన ఈ అవమానం.. మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నాను అంటూ భువనేశ్వరి లేఖ విడుదల చేశారు.
ఇదీ చదవండి: అమ్మా టీ చాలా బాగుంది.. ఓడిపోయిన చోటే నెగ్గాలి అంటున్న లోకేష్
అసెంబ్లీలో ఈ ఘటన జరిగి చాలా రోజేలే అవుతున్నాది.. అయినా రాజకీయ రచ్చకు మాత్రం ఎండ్ కార్డు పడడం లేదు. అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు.. చంద్రబాబు సభకు హాజరైన కాసేపటికే మంత్రులు, వైసీపీ నేతలు మూకుమ్మడిగా మాటల దాడి చేశారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆయన అసెంబ్లీ సమావేశాలను బహిస్కరిస్తూ.. మళ్లీ ముఖ్యమంత్రి అయిన తరువాత అసెంబ్లీలో అడుగు పెడతాను అంటూ శపథం చేశారు..
ఆ తరువాత అసెంబ్లీ ఘటనపై మీడియాతో మాట్లాడిన ఆయన.. తనను వ్యక్తిగతంగా తిట్టినా పట్టించుకోనని.. కానీ రాజకీయాలతో సంబంధం లేని తన భార్యను వ్యక్తిగతంలో కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్టు కాదన్నారు. ఆ మాటలు గుర్తొచ్చి వెక్కి వెక్కి ఏడ్చారు. అప్పటి నుంచి ఈ అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తూనే ఉంది. చంద్రబాబుకు మద్దతుగా కొందరు.. వైసీపీకి అనుకూలంగా కొందరు మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Assembly, AP News, AP Politics, Chandrababu Naidu, Nara Bhuvaneshwari, TDP