జగన్‌కు చంద్రబాబు భార్య కౌంటర్...

పెరిగిపోతున్న ఉల్లి ధరలపై చంద్రబాబు సతీమణి భువనేశ్వరి స్పందించారు.

news18-telugu
Updated: December 10, 2019, 11:33 AM IST
జగన్‌కు చంద్రబాబు భార్య కౌంటర్...
నారా భువనేశ్వరి(ఫైల్ ఫోటో)
  • Share this:
హెరిటేజ్ ఫ్రెష్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న భువనేశ్వరి... పెరిగిపోతున్న ఉల్లి ధరలపై స్పందించారు. కిలో ఉల్లి రూ. 120పైగా అమ్ముతున్నారని ఆమె అన్నారు. ఈ కారణంగా పేద, దిగువ, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఉల్లి ధరలతో గృహిణిగా నేను కూడా ఇబ్బంది పడుతున్నానని భువనేశ్వరి అన్నారు. ఉల్లి ధరలు ఇంత పెరగడం తానెప్పుడూ చూడలేదని తెలిపారు. ఉల్లి ధరలు తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.

నిన్న అసెంబ్లీలో ఉల్లి ధరలపై చర్చ సందర్భంగా హెరిటేజ్‌లో కిలో ఉల్లిపాయలను రూ. 200 రూపాయలకు అమ్ముతున్నారని సీఎం జగన్ ఆరోపించారు. ఇందుకు కౌంటర్ ఇచ్చిన చంద్రబాబు... హెరిటేజ్ ప్రెష్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని... అది ఫ్యూచర్ గ్రూప్ పరిధిలోకి వస్తుందని అన్నారు. దీనిపై ఏపీ సీఎం, మంత్రులు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
Published by: Kishore Akkaladevi
First published: December 10, 2019, 11:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading