• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • NANI REVEALS MINISTERS NAME THAT CONTRACT OUTSOURCING DOES NOT ELIMINATE EMPLOYEES IN RTC BN

ఆర్టీసీలో ఆ ఉద్యోగులను తొలగించట్లేదు.. రవాణ శాఖ మంత్రి నాని

ఆర్టీసీలో ఆ ఉద్యోగులను తొలగించట్లేదు.. రవాణ శాఖ మంత్రి నాని

మంత్రి పేర్నినాని

రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కరోనా వైరస్ రక్షణ ఇన్సూరెన్స్ లేదని, అందువల్ల పర్మినెంట్ ఉద్యోగులను ముందుగా విధులకు వినియోగించుకోవాలని సర్క్యులర్ జారీ చేసినట్టు చెప్పారు.

  • Share this:
    ఆర్టీసీలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నారంటూ వస్తున్న వదంతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పేర్ని నాని చెక్ పెట్టారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎవ్వరినీ తొలగించట్లేదని మంత్రి పేర్ని నాని శనివారం తెలిపారు. అయితే రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కరోనా వైరస్ రక్షణ ఇన్సూరెన్స్ లేదని, అందువల్ల పర్మినెంట్ ఉద్యోగులను ముందుగా విధులకు వినియోగించుకోవాలని సర్క్యులర్ జారీ చేసినట్టు చెప్పారు. దీన్ని కూడా రాజకీయం చేసి ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్టీసీకి వచ్చిన ఆర్థిక సంక్షోభం వల్ల మాత్రమే వేతనాలు చెల్లించలేకపోయామని తెలిపారు. ఆర్టీసీలో ఎవరినీ తొలగించట్లేదని, అందరూ యథావిధిగా కొనసాగుతారని మంత్రి వివరించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాల కల్పనే గానీ తొలగింపు అనేది ఉండదని ఉద్ఘాటించారు.
    Published by:Narsimha Badhini
    First published:

    అగ్ర కథనాలు