హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

కొడాలి నాని, వంశీకి నందమూరి హీరో వార్నింగ్..

కొడాలి నాని, వంశీకి నందమూరి హీరో వార్నింగ్..

వల్లభనేని వంశీ, కొడాలి నాని (file Photos)

వల్లభనేని వంశీ, కొడాలి నాని (file Photos)

ఏపీ మంత్రి కొడాలి నాని, తెలుగు దేశం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై నందమూరి హీరో తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.

ఏపీ మంత్రి కొడాలి నాని, తెలుగు దేశం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై నందమూరి జయకృష్ణ తనయుడు చైతన్య కృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. తెలుగు దేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి ఏమన్నా అంటే ఊరుకునేది లేదన్నారు. పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించిన వ్యక్తి పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని తీవ్ర స్థాయిలో వారిద్దరిపై మండిపడ్డాడు. ఈ  విషయమై చైతన్యకృష్ణ ఒక వీడియో రిలీజ్ చేసారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు మావయ్యే అన్నారు. ఆయనను నోటి కొచ్చినట్టు దూషిస్తే సహించేది లేదంటున్నారు. ఏమైనా ఉంటే విధి విధానాల పరంగా ఉండే విమర్శించండి కానీ.. వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ చైతన్యకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈయన గతంలో ‘ధమ్’ అనే సినిమాతో తెరంగేట్రం చేసినా హీరోగా నిలుదొక్కుకోలేకపోయాడు.

First published:

Tags: Ap cm ys jagan mohan reddy, Balakrishna, Jr ntr, Kodali Nani, Nandamuri Chaitanya Krishna, Tdp, Telugu Cinema, Tollywood, Vallabaneni Vamsi, Ycp

ఉత్తమ కథలు