Home /News /andhra-pradesh /

NANDAMURI BALAKRISHNA REACTS ON GORANTLA MADHAV VIDEO CALL INCIDENT IN LEPAKSHI UMG

Nandamuri Balakrishna: "ఏ మొహం పెట్టుకుని వచ్చాడు.. సిగ్గుతో తల దించుకోవాల్సింది".. ఎంపీ గోరంట్లపై బాలయ్య ఫైర్

గోరంట్ల మాధవ్ వ్యవహారంపై బాలయ్య రియాక్ట్

గోరంట్ల మాధవ్ వ్యవహారంపై బాలయ్య రియాక్ట్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) సంచనం రేపిన హిందూపురం (Hindupur) ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) న్యూడ్ వీడియో వ్యవహారంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తొలిసారి స్పందించారు. సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి.. జాతీయ జెండా వందనానికి ఏ మొహం పెట్టుకుని వచ్చాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించిన ఎంపీకి పోలీసులు సపోర్ట్ ఇవ్వడం సిగ్గుచేటన్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur, India
    ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) సంచనం రేపిన హిందూపురం (Hindupur) ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) న్యూడ్ వీడియో వ్యవహారంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తొలిసారి స్పందించారు. సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి.. జాతీయ జెండా వందనానికి ఏ మొహం పెట్టుకుని వచ్చాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించిన ఎంపీకి పోలీసులు సపోర్ట్ ఇవ్వడం సిగ్గుచేటన్నారు. సత్యసాయి జిల్లా లేపాక్షిలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో బుధవారం రాత్రి బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు.

    ఎంపీ గోరంట్ల మాధవ్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున జెండా ఆవిష్కరణకు రావడంతోనే టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని.. ఆ సమయంలో పోలీసులు తమ లాఠీలతో జులుం ప్రదర్శించారంటూ బాలకృష్ణ మండిపడ్డారు. అలాంటి వీడియోలు చేసిన వ్యక్తి ఇలాంటి పనులా చేసేదంటూ ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. తమ పార్టీ కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని.. ఎవరికీ భయపడమంటూ కార్యకర్తల్లో జోష్ నింపారు. ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని.. సరైన సమయంలో గుణపాఠం చెబుతారంటూ బాలయ్య అధికార పార్టీకి హెచ్చరికలు జారీ చేశారు.

     ఇదీ చదవండి: బాలయ్యా.. బావ బొమ్మేదయ్యా..! 'ఎన్టీఆర్ ఆరోగ్య రథం'పై కనిపించని చంద్రబాబు ఫొటో..


    మరోవైపు ఏపీ మంత్రులపై కూడా నందమూరి బాలకృష్ణ విమర్శలు చేశారు. ఏ మంత్రికి ఏ అధికారం ఉందో ఎవరికీ తెలియదని.. మంత్రుల కాన్వాయ్‌లకు డీజిల్ ఖర్చు కూడా దండగే అంటూ విమర్శించారు. సంక్షేమ పథకాల అమలులోనూ కోత పెడుతున్నారని.. స్థానిక నాయకులు అవకతవకలకు పాల్పడుతున్నారని నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి ఓటేసి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బీజేపీకి దాసోహం అందని.. 25 మంది ఎంపీలను ఇస్తే తెస్తామన్న ప్రత్యేక హోదా ఏదంటూ ఆయన చురకలు అంటించారు.

    అయితే, ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ ఇష్యూపై అనంతపురం పోలీసులు దర్యాప్తు చేపట్టి.. ఒరిజినల్ వీడియో ఉంటేనే ఒరిజినలా ఫేకా అనేది చెప్పగలమంటూ స్పష్టం చేశారు. ఈ వీడియో ఎవరో చూస్తున్న సమయంలో రికార్డు చేసి దాన్ని అనేక సార్లు ఫార్వార్డ్ చేశారని తేల్చారు. ఈ వీడియో మొదటగా ఐటీడీపీ వాట్సాప్ గ్రూప్‌లోనే వచ్చిందని.. అక్కడ నుంచి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిందంటూ వివరించారు.



    'బాదుడే బాదుడు' నిరసనలో భాగంగా సత్యసాయి జిల్లా లేపాక్షిలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేపట్టిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొ్న్నారు. అంతకు ముందు బుధవారం ఉదయం హిందూపురంలో ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలోని పేద ప్రజల కోసం రూ.40 లక్షలతో ప్రత్యేక బస్సుతో వైద్య సహకారాలు అందిస్తున్నట్లు బాలకృష్ణ పేర్కొన్నారు.
    Published by:Mahesh
    First published:

    Tags: Nandamuri Balarkrishna

    తదుపరి వార్తలు