హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Akhanda: బాలయ్య ఫ్యాన్స్ అంటే అంతే మరి.. అఖండపై అభిమానాన్ని ఇలా చాటుకున్న అభిమాని..

Akhanda: బాలయ్య ఫ్యాన్స్ అంటే అంతే మరి.. అఖండపై అభిమానాన్ని ఇలా చాటుకున్న అభిమాని..

బాలయ్యకు సర్కార్ షాక్

బాలయ్యకు సర్కార్ షాక్

Akhanda Mass Jatara: బాలకృష్ణ బ్లాక్ బస్టర్ సినిమాల్లో అగ్రస్థానంలో నిలిచే వాటిలో అఖండ ఒకటి.. తెలుగు రాష్ట్రాల్లో మాస్ జాతరలో ఇప్పటికే సినిమా రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. దీంతో బాలయ్య అభిమానుల సందడి మరింత పెరిగింది. ఇక బాలయ్య పై అభిమానం అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఓ అభిమాని చేసి చూపించాడు.

ఇంకా చదవండి ...

  Nanandamuri Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ  రెండు విభిన్న పాత్రల్లో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda) మాస్ క్రేజ్ ఎక్కడా తగ్గడం లేదు.. సినిమా వంద రోజుల దిశగా పరుగులు పెడుతోంది. దీంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోతోందది. కేవలం థియేటర్స్ లోనే కాదు.. ఓటీటీ ఫ్లాట్ ఫాం పైనా అఖండ తిరుగులేని హిట్ గా గుర్తింపు తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర శివ తాండవం చేసిన ఈ సినిమా ఓటీటీలో కూడా రికార్డులు బద్దలు కొడుతోంది. అక్కడ వచ్చిన క్షణం నుంచే రికార్డులు తిరగరాస్తున్నారు బాలయ్య. దీంతో నందమూరి అభిమానులకు ఓ పండుగలా ఉంది. సాధారణంగానే బాలయ్యను దేవుడిలా చూస్తారు అభిమానులు.. ఆయన కోసం ఏ చేయేడానికైనా సిద్ధం అనేంత రేంజ్ అభిమానం చూపిస్తుంటారు. ఇతర హీరోల అభిమానుల సంగతి ఎలా ఉన్నా.. బాలకృష్ణ (Blakrishna) అభిమానుల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడైనా సరే జై బాలయ్య అంటూ బాలకృష్ణ కోసం ఏం చేయడానికైనా ఢీ అంటే ఢీ అంటారు.. ఆయనపై అంతగా అంతులేని అభిమానం చూపిస్తూ ఉంటారు.

  అందుకే ఇతర హీరోల ఫ్యాన్స్ కంటే.. బాలయ్య అభిమానుల లెక్క వేరే లెవెల్ అనే టాక్ ఎప్పటినుంచో ఉంది. గుండెల నిండా ప్రేమ, అభిమానంతో తమ హీరో సినిమా వచ్చిందంటే చాలు థియేటర్ల వద్ద ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేసేస్తారు. ఇక బొమ్మ బ్లాక్ బస్టర్ అయితే వారిని ఆపడం ఎవరి తరం కాదు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఇటీవల బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ (Akhanda) సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. నందమూరి అభిమానులు ఫుల్ ఖిషి అవుతున్నారు. వివిధ రూపాల్లో తమ అభిమానాన్ని చూపిస్తున్నారు. బాలయ్యపై అభిమానం అంటే ఇది అంటూ సోషల్ మీడియాను సైతం షేక్ చేస్తున్నారు.

  ఇదీ చదవండి: అంధకారంలో ఆంధ్రప్రదేశ్.. పలు జిల్లాల్లో మూడు గంటలకు పైగా పవర్ కట్.. కారణం ఏంటో తెలుసా..?

  తాజాగా ఓ అభిమాని బాలకృష్ణ పై ఉన్న ఇష్టాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. తిరుపతి (Tirupati)లో ఉండే బాలయ్య అభిమాని ఒకరు అఖండ పేరుతో ఓ హోటల్ ను ప్రారంభించాడు. తిరుపతిలో ఆ హోటల్ ఇప్పుడు ఫేమస్ అయిపోయింది. బాలయ్య పై ఉన్న అభిమానాన్ని చాటుకున్న సదరు అభిమానిని హోటల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు నందమూరి అభిమానులు.

  బాలయ్య అభిమానుల అంటే ఇది అంటూ హల్ చల్ చేస్తున్నారు. అఖండ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీకే కొత్త ఊపును ఇచ్చింది. ఇటు అన్ స్టాప్ బుల్ షో.. అఖండ స్ట్రీమింగ్ తో ఓటీటీని కూడా బాలయ్య షేక్ చేస్తున్నారు. ఇప్పడు అదే జోష్ తో డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Akhanda movie, Andhra Pradesh, AP News, Bala Krishna Nandamuri, Balakrishna

  ఉత్తమ కథలు