కొద్దిరోజుల క్రితం సినిమా ఫంక్షన్‌లో అక్కినేనిపై నోరు జారిన బాలకృష్ణ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అక్కినేని తొక్కినేని అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని మనవళ్లు నాగచైతన్య, అఖిల్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటివరకు నాగార్జున (Nagarjuna) మాత్రం నోరు మెదపలేదు. అయితే తాజాగా ఈ అంశంపై స్పందించిన బాలకృష్ణ (Balakrishna)... ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్(ANR) రెండు కళ్లలాంటివారని.. నాన్న నేర్పిన క్రమశిక్షణ, బాబాయ్ నుంచి పొగడ్తలకు దూరంగా ఉండడం అన్న విషయాన్ని నేర్చుకున్నానని చెప్పారు. ఫ్లోలో వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదని అన్నారు. నాగేశ్వరరావు తన పిల్లలకంటే ఎక్కువగా నన్ను ప్రేమించే వారని చెప్పుకొచ్చారు.
తన తండ్రి చనిపోయిన తరువాత ఆయన పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారికి అందించామని అన్నారు. బాబాయ్‌పై ప్రేమ గుండెల్లో ఉంటుందని... బయట ఏం జరిగినా తాను పట్టించుకోనని అన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ వ్యాఖ్యల క్రమంలో ఏఎన్నార్ తన సొంత పిల్లలు కంటే తననే ఎక్కువగా చూసుకొనేవారని బాలకృష్ణ... తనను ప్రేమగా, ఆప్యాయంగా పలకరించేవారని వివరించారు. ఆయనకు అక్కడ ఆప్యాయత లేదని..ఇక్కడ ఉందని అన్నారు. బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపాయి. అసలు ఆయన ఈ రకంగా ఎందుకు అన్నారనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అక్కినేని ఫ్యామిలీని ఏదో రకంగా టార్గెట్ చేసే విధంగానే బాలకృష్ణ ఈ రకమైన వ్యాఖ్యలు చేశారేమో అనే టాక్ కూడా వినిపిస్తోంది. మరోవైపు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటివరకు స్పందించని నాగార్జున... ఇప్పుడు ఈ కామెంట్స్ మీద రియాక్ట్ అవుతారో లేదో చూడాలని పలువురు చర్చించుకుంటున్నారు. నిజానికి బాలకృష్ణ తాను చేసిన కాంట్రవర్సీ కామెంట్స్‌కు వివరణ ఇవ్వడానికి బదులుగా మరో వివాదానికి తెరలేపినట్టు కనిపిస్తోంది.
Balakrishna : అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలపై స్పందించిన బాలయ్య.. ఫ్లోలో వచ్చేసింది...
అక్కినేనిపై చేసిన వ్యాఖ్యలకు నాగార్జున స్పందించకపోయినా.. ఈసారి ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసే విధంగా చేసిన కామెంట్స్‌కు నాగార్జున రియాక్ట్ అవుతారో లేదో చూడాలనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు బాలకృష్ణ, నాగార్జున ఫ్యామిలీ మధ్య కొంతకాలంగా గ్యాప్ ఉందనే వాదన ఉంది. అందుకే తన సినిమా ఫంక్షన్లతో పాటు అన్‌స్టాపబుల్ షోకు కూడా నాగార్జునను ఆయన ఆహ్వానించలేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అక్కినేనిపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన బాలకృష్ణ.. ఈసారి ఆ ఫ్యామిలీని ఇరుకునపెట్టేలా కామెంట్స్ చేశారనే చర్చ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akkineni nagarjuna, Balakrishna