హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nandamuri Balakrishna: సీఎం జగన్‌ను కలుస్తా.. కానీ అందుకోసమే.. తేల్చేసిన బాలకృష్ణ

Nandamuri Balakrishna: సీఎం జగన్‌ను కలుస్తా.. కానీ అందుకోసమే.. తేల్చేసిన బాలకృష్ణ

Nandamuri Balakrishna: తక్కువ టిక్కెట్ ధరలతో అఖండ పెద్ద బ్లాక్‌బస్టర్‌ అయిందని.. ఈ విషయం అందరికీ తెలుసని బాలకృష్ణ కామెంట్ చేశారు.

Nandamuri Balakrishna: తక్కువ టిక్కెట్ ధరలతో అఖండ పెద్ద బ్లాక్‌బస్టర్‌ అయిందని.. ఈ విషయం అందరికీ తెలుసని బాలకృష్ణ కామెంట్ చేశారు.

Nandamuri Balakrishna: తక్కువ టిక్కెట్ ధరలతో అఖండ పెద్ద బ్లాక్‌బస్టర్‌ అయిందని.. ఈ విషయం అందరికీ తెలుసని బాలకృష్ణ కామెంట్ చేశారు.

  ఇటీవల పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు సీఎం జగన్‌ను కలిసి సినీ పరిశ్రమకు సంబంధించి సమస్యలపై చర్చించిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో గతంలో ఎన్నడూ లేని విధంగా చిరంజీవితో పాటు మహేశ్ బాబు, ప్రభాస్ వంటి క్రేజీ హీరోలు కూడా పాల్గొన్నారు. అయితే సీఎం జగన్‌తో జరిగిన భేటీకి టాలీవుడ్ స్టార్ హీరోలైన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనలేదు. నందమూరి కుటుంబంలోని స్టార్ హీరోలైన ఈ ఇద్దరూ ఈ కీలక సమావేశానికి దూరంగా ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీతో అనుబంధం కారణంగానే ఈ ఇద్దరు సీఎం జగన్‌తో సమావేశానికి రాలేదనే వార్తలు వినిపించాయి. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు స్పందించలేదు. తాజాగా ఈ వ్యవహారంపై నందమూరి బాలకృష్ణ రియాక్ట్ అయ్యారు.

  టికెట్ రేట్స్ గురించి సీఎం జగన్‌తో సమావేశానికి సినీ ప్రముఖులు తనను కూడా ఆహ్వానించారని బాలకృష్ణ తెలిపారు. అయితే ఆ సమావేశానికి తాను రానని చెప్పానని అన్నారు. ఈ విషయంలో తనకు స్పష్టమైన విధానం ఉందని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. తాను సినిమాల విషయంలో రెమ్యూనరేషన్ పెంచనని అన్నారు. తన సినిమా బడ్జెట్‌ను కూడా పెంచనని తెలిపారు. అలా చేసి నిర్మాతను ఇబ్బంది పెట్టే ఆలోచన తనకు ఉండదని అన్నారు. టికెట్ రేట్స్ మీద గతంలోనే తాను కొన్ని సూచనలు చేశానని బాలకృష్ణ వెల్లడించారు.

  సినిమా బడ్జెట్ గురించి కూడా ఆలోచించాలని చెప్పానని వ్యాఖ్యానించారు. తక్కువ టిక్కెట్ ధరలతో అఖండ పెద్ద బ్లాక్‌బస్టర్‌ అయిందని.. ఈ విషయం అందరికీ తెలుసని బాలకృష్ణ కామెంట్ చేశారు. ఇదే సమయంలో సీఎం జగన్‌ను కలిసే విషయంలో బాలకృష్ణ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. రాజకీయంగా అయితే హిందూపురం కోసం సీఎం జగన్‌ను కలుస్తానని బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. కానీ టికెట్ రేట్ల విషయంలో మాత్రం ముఖ్యమంత్రిని కలిసే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. ఇక సినిమా టికెట్ల రేట్ల సంగతి అలా ఉంచితే.. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలని కొద్దిరోజుల క్రితం నందమూరి బాలకృష్ణ ఆందోళన చేపట్టారు.

  Ali Meets CM Jagan: సీఎం జగన్ తో నటుడు ఆలీ భేటీ.. కారణం ఇదేనా..? గుడ్ న్యూస్ చెప్పేశారా..?

  AP DGP Issue: గౌతమ్ సవాంగ్ బదిలీకి ప్రధాన కారణం ఇదేనా.. అందుకే నిర్ణయం తీసుకున్నారా..?

  ఏపీ ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలనే పోరాటం కోసం అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని ఆయన వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టించింది. ఇందుకోసం అవసరమైతే సీఎం జగన్‌ను కలుస్తానని అన్నారు. అయితే ఈ విషయంలో తనను కలుస్తానన్న బాలకృష్ణకు సీఎం జగన్ ఆ అవకాశం ఇస్తారా ? అన్నది చెప్పడం కష్టమే అని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.

  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Nandamuri balakrishna

  ఉత్తమ కథలు