హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nandamuri Balakrishna : “అన్నీ దేవుడే చూసుకుంటాడు” సినిమా టికెట్ల వివాదంపై బాలయ్య కీలక వ్యాఖ్యలు..

Nandamuri Balakrishna : “అన్నీ దేవుడే చూసుకుంటాడు” సినిమా టికెట్ల వివాదంపై బాలయ్య కీలక వ్యాఖ్యలు..

Nandamuri Balakrishna :  “అన్నీ దేవుడే చూసుకుంటాడు” సినిమా టికెట్ల  వివాదంపై బాలయ్య కీలక వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సినిమా టికెట్ల వ్యవహారంపై (Movie Tickets Issue) నందమూరి బాలకృష్ణ (Nandamuru Bala Krishna) కీలక వ్యాఖ్యలు చేశారు. అఖండ సినిమా (Akhanda Movie) ఘన విజయం సాధించిన నేపథ్యంలో విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న బాలకృష్ణ.. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సినిమా టికెట్ల వ్యవహారంపై (Movie Tickets Issue) నందమూరి బాలకృష్ణ (Nandamuru Bala Krishna) కీలక వ్యాఖ్యలు చేశారు. అఖండ సినిమా (Akhanda Movie) ఘన విజయం సాధించిన నేపథ్యంలో విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న బాలకృష్ణ.. అనంతరం మీడియాతో మాట్లాడారు. సినిమా టికెట్ల విధానంపై గతంలో చర్చించుకున్నామని..ఏదైతే అధని సినిమాను విడుదల చేశామన్నారు. సినిమా మంచిగా రావడంతో ధైర్యం చేసి ముందుకొచ్చామన్నారు. సినిమా టికెట్లపై ప్రభుత్వం అప్పీల్ కు వెళ్తామంటోందని కొంతకాలం వేచి చూద్దామన్నారు. న్యాయ నిర్ణేతగా దేవుడున్నాడని... ఆయనే చూసుకుంటాడని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. గతంలో ఈ విషయంపై తాను మాట్లాడానని.. హైకోర్టు (High Court) తీర్పు నేపథ్యంలో ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో చూడాలన్నారు.

సినిమాల గురించి కూడా బాలకృష్ణ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మంచి కథ వస్తే మల్టీస్టారర్ సినిమా చేస్తామన్న ఆయన.. అఖండ చిత్ర విజయం సినీ పరిశ్రమకు ఊపిరినిచ్చిందన్నారు. అఖండ విజయం తో మిగతా వారికి ధైర్యం వచ్చిందన్న ఆయన.. అందరూ సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు.

ఇది చదవండి: టాలీవుడ్ లో పవన్ వ్యాఖ్యల దుమారం.. నిర్మాతల్లో టెన్షన్..


నందమూరి తారక రామారావు ఆనాడు భక్తిని కాపాడారు.., ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడిన సినిమా అఖండ అని బాలకృష్ణ అన్నారు. సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం మంగళగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అఖండ యూనిట్.. అక్కడి నుంచి దర్శకుడు బోయపాటి శ్రీను స్వగ్రామానికి వెళ్లారు.

ఇది చదవండి: ఏపీలో పెరగనున్న విద్యుత్ ఛార్జీలు..? ఎవరెంత చెల్లించాలంటే..!


ఏపీలో సినిమా టికెట్లను తగ్గిస్తూ ఇచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది.. పాత విధానంలోనే టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు వెసులుబాటు కల్పించింది. సినిమా టికెట్ల ధరలు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదంటూ థియేటర్ల యాజమాన్యాల తరపు న్యాయవాదుల వాదనలు వినిపించారు. సినిమా విడుదల సమయంలో టికెట్ల రేట్లు పెంచుకునే హక్కు థియేటర్ల యాజమాన్యాలకు ఉంటుందని తెలిపారు. టికెట్ల ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని తెలిపారు. పిటిషనర్ తరపు వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. వెంటనే టికెట్ల రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.35ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సస్పెండ్ చేసింది.

ఇది చదవండి: ఏపీ కేబినెట్ మార్పుల్లో ట్విస్ట్..! ఆ ఎనిమిది మంది చుట్టూనే రాజకీయం..


త్వరలోనే పుష్పా, ఆర్ఆర్ఆర్, శ్యామ్ సింగరాయ్, ఆచార్య, రాధేశ్యామ్ లాంటి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ కానున్నాయి. తాజాగా కోర్టు తీర్పు ఈ పెద్ద సినిమాలు అన్నింటికీ బిగ్ రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి.. మరి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది అన్నది చూడాలి.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Akhanda movie, Andhra Pradesh, Bala Krishna Nandamuri, Vijayawada

ఉత్తమ కథలు