Andhra Pradesh: కన్నబాబు, అంబటికి కోర్టు షాక్... నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు (ఫైల్)

గతంలో చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థపై కన్నాబు (Kanna Babu), అంబటి రాంబాబు (Ambati Rambabu) తప్పుడు ఆరోపణలు చేసి తమ పరువుకు భంగం వాటిల్లేలా చేశారంటూ ఆ కంపెనీ వారిద్దరిదీ పరువు నష్టం దావా వేసింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇద్దరు కీలక వ్యక్తులకు కోర్టు షాకిచ్చింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిథి అంబటి రాంబాబుపై హైదరాబాద్ లోని లాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఇద్దరు నేతలు విచారణకు హాజరుకాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో శుక్రవారం ఇద్దరూ హాజరుకావాల్సి ఉండగా కోర్టు ముందుకు రాకపోవడంతో వచ్చే వాయిదాకు తప్పనిసరిగా రావాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.

    గతంలో చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థపై కన్నాబు, అంబటి రాంబాబు తప్పుడు ఆరోపణలు చేసి తమ పరువుకు భంగం వాటిల్లేలా చేశారంటూ ఆ కంపెనీ వారిద్దరిదీ పరువు నష్టం దావా వేసింది. ప్రస్తుతం ఈ విచారణ ప్రజాప్రతినిథుల కోర్టులో విచారణలో ఉంది. గత నెల 5వ తేదీన ఇద్దరు నేతలు ప్రత్యక్షంగా విచారణకు హాజరుకావాల్సిందిగా కోర్టు ఆదేశించినా ఇద్దరూ పట్టించుకోలేదు. దీంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

    ఇది చదవండి: మరో ఉచిత పథకాన్ని తీసుకొచ్చిన జగన్.. కేవలం వారికి మాత్రమే వర్తింపు



    మరోవైపు గత వాయిదాకు పిటిషన్ వేసిన హెరిటేజ్ కంపెనీ ప్రతినిథి సాంబమూర్తి కూడా విచారణకు రాకపోవడంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసులో రెండువైపుల వారు గైర్హాజరైతే కేసులు విచారణ ముందుకెళ్లడం కష్టమని న్యాయమూర్తి అభిప్రాయపడ్డట్లు సమాచారం.
    Published by:Purna Chandra
    First published: