నల్గొండ (Nalgonda)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. పట్టణ శివారులోని ఎఫ్సీఐ గోదాముల సమీపంలో ఓ బైక్ అదుపు తప్పి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. వారి తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను నల్గొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పిల్లల మృతదేహాలను కూడా మార్చురీకి తరలించారు. వీరిని నెల్లూరు వాసులుగా గుర్తించారు. ఓ వ్యక్తి తన పిల్లలతో కలిసి బైక్పై వెళ్తుండగా ఓ గేదె ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చింది. దానిని తప్పించబోయి.. అదుపు తప్పి బైక్ కింద పడింది. ఇద్దరు పిల్లల తలలకు బలమైన గాయాలవడంతో రోడ్డుపై అపస్మారక స్థితితో పడిఉన్నారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. తండ్రి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Breaking News: ప.గో జిల్లాలో ఘోర ప్రమాదం.. వాగులో పడిన ఆర్టీసీ బస్సు.. 9 మంది మృతి
ప్రమాదం జరిగిన సమయంలో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అదే మార్గంలో వెళ్తున్నారు. రోడ్డు ప్రమాదం గురించి వెంటనే తన వాహనాన్ని ఆపారు. అనంతరం ప్రభుత్వాస్పత్రికి ఫోన్కు చేసి.. 108 అంబులెన్స్ వాహనాన్ని పిలిపించారు. వైద్యుడితో మాట్లాడి గాయపడిన వ్యక్తికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. కానీ అప్పటికే ఇద్దరు పిల్లలు మరణించారని, తండ్రి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Breaking News: ప.గో జిల్లాలో ఘోర ప్రమాదం.. వాగులో పడిన ఆర్టీసీ బస్సు.. 9 మంది మృతి
కాగా, ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. జంగారెడ్డి గూడెం సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పు జల్లేరు వాగులో పడటంతో 9 మంది ప్రయాణికులు మృతి చెందారు. బస్సు వాగులో పడిన సమయంలో 47 మంది ప్రయాణికులున్నట్లు స్థానికులు తెలిపారు.ప్రమాదంపై మంత్రులు, అధికారులను ఆరాతీసిన జగన్.. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని.. మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. మృతులకు రూ.25లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nalgonda, Road accident