Viral Video: నాగుల చవితి పూజలు.. పుట్టలో గుడ్లను ఆరగించిన పాము

భక్తుల సందడి తర్వాత పుట్టలో నుంచి ఓ నాగు పాము బయటకు వచ్చి.. గుడ్లను ఆరగించింది. పాము గుడ్డును తింటున్న దృశ్యాలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు.

news18-telugu
Updated: November 19, 2020, 3:15 PM IST
Viral Video: నాగుల చవితి పూజలు.. పుట్టలో గుడ్లను ఆరగించిన పాము
గుడ్లు ఆరగిస్తున్న పాము
  • Share this:
నాగుల చవితిని మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. బుధవారం తెలుగు రాష్ట్రాల్లో నాగుల చవితిని ఉత్సహంగా జరుపుకున్నారు. నాగుల చవితి రోజున మహిళలు వేకువజామునే తలస్నానం చేసి.. పూజా సామాగ్రితో పుట్టల వద్దకు వెళ్లి పూజలు చేస్తారు. పుట్టలో పాలు పోసి పాములకు గుడ్లను ఆహారంగా పెడతారు. బుధవారం ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లోని పుట్టలు భక్తులతో కిటకిటలాడాయి. ఐతే శ్రీకాకుళం జిల్లాలో నాగుల చవితి రోజున ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

శ్రీకాకుళంలోని ఓ గ్రామంలో స్థానిక మహిళలు పుట్టకు పూజలు చేశారు. అనంతరం పుట్ట లోపలికి పాలు పోయడంతో పాటు కోడిగుడ్లును కూడా వేశారు. భక్తుల సందడి తర్వాత పుట్టలో నుంచి ఓ నాగు పాము బయటకు వచ్చి.. గుడ్లను ఆరగించింది. పాము గుడ్డును తింటున్న దృశ్యాలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుడ్లను తింటున్న పాముకు మహిళలు నమస్కరించారు. సాక్షాత్తు నాగ దేవత వచ్చిందని చేతులెత్తి మొక్కారు.



కాగా, పుట్టలో పాలు పోయవద్దని జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు చెప్పారు. వాస్తవానికి పాముకు పాలు అరగవని.. పుట్టలో పాలు పోసి వాటిని ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. కానీ మహిళలు మాత్రం పుట్టలో పాలు పోసి.. గుడ్లు వేసి.. తమ భక్తిని చాటుకున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: November 19, 2020, 11:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading