నాగార్జున సాగర్‌కు జలకళ... 8 గేట్లు ఎత్తి నీటి విడుదల

నాగార్జునసాగర్ డ్యామ్

ఇప్పటికే జూరాల, శ్రీశైలం జలాశయాలు పూర్తిగా నిండిపోవడంతో గేట్లు తెరిచి దిగువకు నీళ్లు వదులుతున్నారు. ఇన్‌ఫ్లో పెరగడంతో నాగార్జునసాగర్ కూడా నిండిపోయింది.

  • Share this:
    తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలకు మళ్లీ జలకళ వచ్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే జూరాల, శ్రీశైలం జలాశయాలు పూర్తిగా నిండిపోవడంతో గేట్లు తెరిచి దిగువకు నీళ్లు వదులుతున్నారు. ఇన్‌ఫ్లో పెరగడంతో నాగార్జునసాగర్ కూడా నిండిపోయింది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం నాగర్జున సాగర్‌ ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేశారు. కాగా, ఈ సీజన్‌లో సాగర్ డ్యామ్ గేట్లు తెరవడం ఇది రెండోసారి. సాగర్‌కు జలకళ రావడంతో ఆ దృశ్యాలను కళ్లారా చూసేందుకు పర్యాటకులు మళ్లీ పోటెత్తే అవకాశముంది.


    First published: