బైక్ అంబులెన్స్ నడిపిన ఎమ్మెల్యే రోజా.. నగరి రోడ్లపై రయ్ రయ్..

బైక్ అంబులెన్స్ నడిపిన ఎమ్మెల్యే రోజా

రోజా కోరిక మేరకు శ్రీ సిటీ హీరో మోటార్స్ కంపెనీ రెండు బైక్ అంబులెన్స్ వాహనాలను అందజేసింది. వాటిని నగరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే రోజా తన చేతుల మీదుగా ప్రారంభించారు.

  • Share this:
    నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ ఆర్కే రోజా ఏం చేసినా సెన్సేషనే..! నిత్యం ప్రజల్లో ఉండే రోజా.. నగరి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ.. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. వాటికి పరిష్కారం చూపుతున్నారు. తాజాగా రోజా చొరవతో నగరి నియోజకవర్గానికి రెండు బైక్ అంబులెన్స్‌లు అందాయి. రోజా కోరిక మేరకు శ్రీ సిటీ హీరో మోటార్స్ కంపెనీ రెండు బైక్ అంబులెన్స్ వాహనాలను అందజేసింది. వాటిని నగరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే రోజా తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బైక్ అంబులెన్స్‌లను నడిపి సందడి చేశారు నగరి ఎమ్మెల్యే.

    నగరి, పుత్తూరు ప్రభుత్వాసుపత్రులకు చెరొకటి బైక్ అంబులెన్స్‌ను అందజేశాు. ఈ కార్యక్రమంలో నగరి పుత్తూరు మెడికల్ ఆఫీసర్లు, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు, పట్టణ ముఖ్య నాయకులు, శ్రీసిటీ హీరో మోటార్స్ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. తన విజ్ఞప్తి మేరకు బైక్ అంబులెన్స్‌లు అందజేసినందుకు హీరో మోటార్స్‌కు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే రోజా
    Published by:Shiva Kumar Addula
    First published: