హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Chiranjeevi: చిరంజీవికి కొత్త తలనొప్పి.. మెగా బ్రదర్ క్లారిటీ ఇవ్వనున్నారా ?

Chiranjeevi: చిరంజీవికి కొత్త తలనొప్పి.. మెగా బ్రదర్ క్లారిటీ ఇవ్వనున్నారా ?

చిరంజీవి (Chiranjeevi/ Twitter)

చిరంజీవి (Chiranjeevi/ Twitter)

Chiranjeevi: ఈ అంశంపై చిరంజీవి ఎలాగూ స్పందించే అవకాశం లేదు కాబట్టి.. నాదెండ్ల వ్యాఖ్యలపై మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు స్పందిస్తారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

  మెగాఫ్యామిలీకి రాజకీయాలు కొత్త కాదు. ఆ మాటకొస్తే చిరంజీవికి కూడా రాజకీయాలు కొత్తేమీ కాదు. కానీ రాజకీయాల్లో రాణించలేకపోయిన మెగాస్టార్... తనంతట తానుగా వాటికి దూరమయ్యారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పేరుతో రాజకీయాలు చేస్తున్నా.. వాటిలో చిరంజీవి ఇన్వాల్వ్ అయిన సందర్భాలు లేవనే చెప్పాలి. అసలు కొన్నేళ్లుగా ఆయన నుంచి ఎలాంటి రాజకీయ ప్రకటనలు రాలేదు. అలాంటి చిరంజీవి గురించి జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ హఠాత్తుగా చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

  పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వడానికి కారణం చిరంజీవేనన్న నాదెండ్ల.. రెండు మూడేళ్లు సినిమాలు చేసిన తర్వాత రాజకీయాలు చేసుకోవాలని పవన్ కళ్యాణ్‌కు సూచించారని తెలిపారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంలో తాను కూడా అండగా ఉంటానని.. కలిసి నడుస్తానని చిరంజీవి పవన్‌కు హామీ ఇచ్చారని మనోహర్ కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. నాదెండ్ల మనోహర్ చేసిన ఈ వ్యాఖ్యలను ఇతర రాజకీయ పార్టీలు సీరియస్‌గా తీసుకుంటాయా లేదా అన్న విషయం పక్కనపెడితే.. మెగా అభిమానులు మాత్రం ఈ అంశంపై ఫోకస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  అయితే ఈ అంశంపై చిరంజీవి ఎలాగూ స్పందించే అవకాశం లేదు కాబట్టి.. నాదెండ్ల వ్యాఖ్యలపై మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు స్పందిస్తారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరోవైపు నాదెండ్ల వ్యాఖ్యలపై అభిమానుల్లో కన్ఫ్యూజన్ నెలకొంటే.. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు క్లారిటీ ఇవ్వొచ్చని కొందరు చర్చించుకుంటున్నారు. చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే అంశంపై గతంలోనే నాగబాబు స్పందించారు. అయితే నాదెండ్ల వ్యాఖ్యలపై మెగా ఫ్యామిలీ తరపున, జనసేన పార్టీలోని ముఖ్యనేతల్లో ఒకరిగా నాగబాబు రియాక్షన్ ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Janasena, Megastar Chiranjeevi, Nadendla Manohar, Pawan kalyan

  ఉత్తమ కథలు