హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

నా POTTA నా ISTAM.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న కొత్త రెస్టారెంట్ పేరు.. అడ్రస్ ఎక్కడంటే..

నా POTTA నా ISTAM.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న కొత్త రెస్టారెంట్ పేరు.. అడ్రస్ ఎక్కడంటే..

రెస్టారెంట్ కు వెరైటీ పేరు

రెస్టారెంట్ కు వెరైటీ పేరు

అప్పట్లో హోటల్ పేర్లను పెద్దగా పట్టించుకునే వారే కాదు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. నెటిజన్ల తరం వచ్చేసింది. అందుకే ప్రస్తుతం హోటల్ స్టార్ట్ చేయకముందే సగం బ్రాండింగ్ పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకుంటున్నారు. పేరుతోనే ప్రమోషన్ చేయించుకుంటున్నారు. తాజాగా రాజమండ్రిలో..

ఇంకా చదవండి ...

ఒకప్పుడు హోటల్ వ్యాపారం మొదలు పెట్టి సక్సెస్ కావాలంటే చాలా శ్రమ పడేవారు. హోటల్ లో వండే ఆహార పదార్థాలు టేస్టీగా ఉండేలా చూసుకునేవారు. చట్నీ దగ్గర నుంచి సాంబార్ దాకా, బిర్యానీ దగ్గర నుంచి అప్పడాల వరకు అన్నింటినీ ఓనర్లు ఓసారి టేస్ట్ చూశాకే కస్టమర్లకు వడ్డించేవాళ్లు. టేస్ట్ సరిగ్గా లేకుంటే వాటిని కస్టమర్లకు వడ్డించేవారే కాదు. హోటల్ బ్రాండ్ కోసం ఎంతో కష్టపడేవారు. అప్పట్లో హోటల్ పేర్లను పెద్దగా పట్టించుకునే వారే కాదు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. నెటిజన్ల తరం వచ్చేసింది. అందుకే ప్రస్తుతం హోటల్ స్టార్ట్ చేయకముందే సగం బ్రాండింగ్ పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకుంటున్నారు. పేరుతోనే ప్రమోషన్ చేయించుకుంటున్నారు. వెరైటీ వెరైటీ పేర్లతో హోటల్ ను పాపులర్ చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు.

రాజమండ్రిలో దానవాయిపేటలో ఇటీవలే కొత్తగా ఓ హోటల్ ప్రారంభమయింది. ఆ హోటల్ పేరు ’నా POTTA నా ISTAM‘. ఈ హోటల్ కు వచ్చిన వాళ్లు తినడం ఆపరనీ, అంతలా తినేస్తున్నావేంటని ఎవరైనా అడిగితే ’నా పొట్ట నా ఇష్టం. ఇక్కడ ఎంతైనా తినాలనిపిస్తుంది‘ అని కస్టమర్లు చెబుతున్నట్టుగా ఉంది కదూ. ఈ హోటల్ పేరు కాస్తా నెట్టింట తెగ వైరల్ గా మారింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ తో వైరల్ చేస్తున్నారు. పేర్లు పెట్టాలన్నా, సెటైర్లు వేయాలన్నా గోదారోళ్ల తర్వాతే ఎవరైనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అన్నట్టు ఇదే గోదావరి జిల్లాలో పాతాళభైరవి, మాయాబజార్ అనే పేర్లతో హోటళ్లు కూడా ఉన్నాయండోయ్.

పొట్టే నా ప్రాణం, తిన్నారా, చిన్ని పొట్ట చింతలేని పొట్ట, దా వచ్చి తిను, పొట్ట నిండా తినండి.. వంటి పేర్లతో కూడా హోటళ్లు రావచ్చంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అన్నట్టు ఈ రాజమండ్రిలోనే ’పొట్ట పెంచుదాం‘ అనే హోటల్ కూడా ఉంది. అప్పట్లో బాబాయ్ హోటల్ అని విజయవాడలో యమా ఫేమస్ అయింది. ఆ హోటల్ పేరుతో సినిమానే తీశారు. ఇప్పుడు అంతా వెరైటీ పేర్లను ఎంచుకుని ముందుగానే కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. వివాహ భోజనంబు, సెకండ్ వైఫ్ అనే పేర్లతో కూడా హైదరాబాద్ లో హోటళ్లు ఉన్నాయి. మరి ముందు ముందు ఇంకెన్ని చిత్ర విచిత్రమైన పేర్లు వస్తాయో.. వేచిచూడాలి.

First published:

Tags: Andhra Pradesh, Business, Business Ideas, East Godavari Dist, Rajahmundry S01p08

ఉత్తమ కథలు