దెయ్యం (Ghosts) అనే పదం వినిపిస్తే చాలు జనం గజగజ వణికిపోతారు. చనిపోయిన వాళ్లు దెయ్యాలుగా మారి వేధించడం, భయపెట్టడం వంటివి చేస్తుంటారని చాలా మంది నమ్ముతారు. ఐతే దెయ్యాలు ఉన్నాయా.. లేవా.. అనే దానికి ఇప్పటివరకు క్లారిటీ లేదు. అప్పుడప్పుడు వింత ఆకారాలు కెమెరా కంట్లో పడటంతో అవి దెయ్యాలనే నమ్ముతుంటారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఇప్పుడు దెయ్యాల కలకలం రేగింది. తూర్పుగోదావరి జిల్లా (East Godavari) రాజమండ్రి (Rajahmundry) మెయిన్ రోడ్డులోని ఓ నగల దుకాణంలో దెయ్యాలున్నాయన్న వార్త స్థానికంగా కలకలం రేపుతోంది. ఈనెల 25వ తేదీ రాత్రి సమయంలో రెండు వింత ఆకారాల నగల షాపులోకి వచ్చినట్లు సీసీ ఫుటేజ్ లో రికార్డైంది. మొబైల్ యాప్ లో సీసీ ఫుటేజ్ ను చూసిన షాపు యజమాని షాక్ కు గురయ్యాడు.
రాజమండ్రిలోని గుండువారి వీధిలో ఓ నగల దుకాణం నుంచి తరచూ వింత అరుపులు, కేకలు వినిపిస్తుండటంతో స్థానికులు భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో యజమాని సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించగా తెల్లటి నీడ మాదిరిగా ఉన్న రెండు ఆకారాలు కదులుతూ కనిపించాయి. సీసీ ఫుటేజ్ లో రెండు దెయ్యాలు చేతులు కదుపుతూ మాట్లాడుకుంటున్నట్లుగా ఉంది. ఐతే అవి నిజంగా దెయ్యాలే లేక మరొకటా అనేది మాత్రం ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ దెయ్యాల సీసీ ఫుటేజ్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
గతంలో దెయ్యాలంటూ ఇలాంటి వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి. సాధారణంగా ప్రతి ఒక్కరిలోనూ దెయ్యమంటే భయం ఉంటుంది. ఢిల్లీలోని ఓ కోర్టులో కుర్చీలు వాటంతట అవే కదలడం, కంప్యూటర్లు ఆన్ అవడం, తలుపులు వాటంతట అవే తెరుచుకోవడం, పేపర్లు ఎగిరిపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అవి దెయ్యాలేనని విపరీతమైన ప్రచారం జరిగింది. కానీ దానిపై ఇంకా స్పష్టత లేదు. అలాగే చాలా చోట్ల దెయ్యాలున్నాయని.. అటువైపు వెళ్లిన వారు తిరిగిరారంటూ అలాంటి ప్రాంతాలకు హాంటెడ్ ప్లేస్ అనే పేర్లు కూడా పెడుతున్నారు కొందరు.
ఇది చదవండి: కరోనా టైమ్ లో కన్నింగ్ ఐడియా.. ఏకంగా రూ.200 కోట్లకు టోకరా.. ఏలా చేశారంటే..!
ఐతే హేతువాదులు మాత్రం దెయ్యాలు లేవని కొట్టిపారేస్తుంటారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో దెయ్యాలను జనం బాగా నమ్ముతారు. చిన్నపాటి జ్వరం వచ్చినా భూతవైద్యుడి దగ్గరకు వెళ్లి తాయత్తు కట్టించుకుంటారు. ఐతే సిటీలు, చదువుకున్నవారు కూడా దెయ్యాలంటే హడలిపోతారు. దెయ్యాలని ఉన్నాయని.. లేవని అంశాలు ఇంతవరకు ఎక్కడా నిరూపణ కాలేదు. మరి రాజమండ్రిలో ఎంటరైనవి దెయ్యాలే లేక మరేదైనానా అనేదానిపై క్లారిటీ రాలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East Godavari Dist, Ghost, Rajahmundry