Home /News /andhra-pradesh /

Mystery Poster: “Sorry మోసం చేయలేదు..” రాజమండ్రిలో పోస్టర్ల వెనుక మిస్టరీ ఇదేనా..?

Mystery Poster: “Sorry మోసం చేయలేదు..” రాజమండ్రిలో పోస్టర్ల వెనుక మిస్టరీ ఇదేనా..?

రాజమండ్రిలో పోస్టర్ల కలకలం

రాజమండ్రిలో పోస్టర్ల కలకలం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తూర్పుగోదావరి జిల్లా (East Godavari) రాజమహేంద్రవరంలో (Rajamahendra Varam) ఓ మిస్టరీ పోస్టర్ కలకలం రేపుతోంది.

    ఏదైనా తప్పుచేసినప్పుడు ఎదుటివారికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తే చెప్పాల్సిన పదం సారీ. ఎదుటివారికి నేరుగా వెళ్లి సారీ చెప్తే జరిగిన గొడవ కాస్త సద్దుమణుగుతుంది. కోపంగా ఉన్నవారు కూల్ అవుతారు. అదే ప్రేమికులు, భార్యాభర్తలు సారీ చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే ఏదైనా గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేసి స్వీట్ గా సారీ చెప్తారు. కొందరు వారికి నచ్చిన స్టైల్లో క్షమాపణ కోరతారు. ఐతే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తూర్పుగోదావరి జిల్లా (East Godavari) రాజమహేంద్రవరంలో (Rajamahendra Varam) ఓ మిస్టరీ పోస్టర్ కలకలం రేపుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో గోడలపై పోస్టర్లు వెలిశాయి. అందులో “Sorry మోసం చేయలేదు” అని రాసి ఉంది. ఈపోస్టర్లు ఎవరు అంటించారు. ఎవరికోసం అంటించారు..? ఎవరికి చెప్పేందుకు ఇలా చేశారనేదానిపై సిటీలో చర్చ జరుగుతోంది.

    ఈ పోస్టర్లపై స్థానికులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ప్రేమికుల మధ్య గొడవ జరిగే ప్రియుడే ప్రేయసిని క్షమాపణ కోరుతూ ఇలాంటి పోస్టర్లు అంటించి ఉంటాడని పలువురు అంటున్నారు. మరికొందరైతే అమ్మాయే అబ్బాయి కోసం అంటించి ఉండొచ్చని కూడా చెబుతున్నారు. కొందరైతే వ్యాపారులే కస్టమర్లను మోసం చేయలేదని నమ్మించేందుకు పోస్టర్లు పెట్టారని కూడా అంటున్నారు. స్నేహితులు కూడా పోస్టర్లు ఏర్పాటు చేసి ఉండొచ్చుకదా..? అని ఇంకొందరంటున్నారు.

    ఇది చదవండి: భర్తకు పోటీగా బరిలో దిగిన ఎమ్మెల్యే రోజా.. కబడ్డీ కోర్టులో అదరగొట్టిన ఫైర్ బ్రాండ్..


    వారు సారీ చెప్పాలనుకుంటున్న వ్యక్తి ప్రతిరోజూ తిరిగే ప్రాంతాలను ఎంచుకొని ఈ పోస్టర్లు అంటించినట్లు తెలుస్తోంది. రోడ్డుపక్కన ఉండే గోడల మీద, కాలేజీల వద్ద ఈ పోస్టర్లు కనిపిస్తున్నాయి. సారీ చెబుతున్నట్లు కామెంట్ తో పాటు బాధపడుతున్న ఎమోజీ కూడా పోస్టర్ పై ముద్రించారు. ఐతే వ్యాపారులు, స్నేహితులు ఇలా చేసిఉండరని.. ఇది ఖచ్చితంగా లవర్స్ పనేనని పలువురు అంటున్నారు. రాజకీయ నాయకులు ఓటర్లకు సారీ చెబుతున్నారా..? అని మరికొందరు ఈ పోస్టర్లపై జోకులు పేలుస్తున్నారు.

    ఇది చదవండి: పక్కింటి వ్యక్తితో భార్య ఎఫైర్.. పద్దతి మార్చుకోవాలని చెప్పినా వినలేదు.. చివరికి..

    మొత్తానికి ఈ పోస్టర్ అంటించిన వ్యక్తి ఎవరోగానీ... రాజమండ్రిలో హాట్ టాపిక్ అయ్యాడు. కొంతమందైతే ఆ పోస్టర్ ను ఎవరైనా పనిగొట్టుకొని వచ్చి చూస్తారా..? లేదా..? అని వచ్చిపోయేవాళ్లని ఫాలో అవుతున్నారు. ఈ పోస్టర్ వెనుకున్న మిస్టరీ వ్యక్తి ఎవరో తేల్చేపనిలో మరికొందరు పడ్డారు. ప్రస్తుతం రాజమండ్రిలో చిన్నా, పెద్ద అంతా ఈ పోస్టర్ గురించే మాట్లాడుకుంటున్నారంటే అతిశయోక్తికాదు. గతంలో ప్రజలు దెయ్యాల భయంతో ఓ స్త్రీ రేపు రా అని తలుపులపై రాసేవారు. ఈ పోస్టర్లును చూసిన వారు ఆ ఘటనను కూడా తలుచుకుంటున్నారు. మరి ఈ పోస్టర్ మ్యాన్ బయటికొస్తాడా.? లేక మిస్టరీ మ్యాన్ గా మిగిలిపోతాడా..? అనేది వేచిచూడాలి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, East Godavari Dist, Rajahmundry, VIRAL NEWS

    తదుపరి వార్తలు