Home /News /andhra-pradesh /

Mystery Disease: పశ్చిమలో వింత వ్యాధి విజృంభణ.. ఒకే ఊరిలో 21 మంది ఆస్పత్రి పాలు

Mystery Disease: పశ్చిమలో వింత వ్యాధి విజృంభణ.. ఒకే ఊరిలో 21 మంది ఆస్పత్రి పాలు

ఏలూరు ఆస్పత్రిలో వింత వ్యాధి బాధితులు (ఫైల్)

ఏలూరు ఆస్పత్రిలో వింత వ్యాధి బాధితులు (ఫైల్)

పశ్చిమ గోదావరి జిల్లాలో మళ్లీ వింతవ్యాధి విజృంభిస్తోంది. దెందులూరు మండలంలోని కొమరెపల్లి గ్రామంలో ప్రజలు ఉన్నట్టుండి పడిపోతున్నార. ఇప్పటి వరకు 21 మంది ఇలా సడన్‌గా పడిపోవడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.

  పశ్చిమ గోదావరి జిల్లాలో మళ్లీ వింతవ్యాధి విజృంభిస్తోంది. దెందులూరు మండలంలోని కొమరెపల్లి గ్రామంలో ప్రజలు ఉన్నట్టుండి పడిపోతున్నార. ఇప్పటి వరకు 21 మంది ఇలా సడన్‌గా పడిపోవడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. బాధితులను ఏలూరు, గుండుగొలను ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా కళ్లు తిరగడం వల్ల పడిపోయారని స్థానికులు చెబుతున్నారు. మనుషులు మాట్లాడుతున్న వారు మాట్లాడుతున్నట్టే పడిపోతున్నారని అంటున్నారు. వారిలో కొందరు ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత కోలుకుని ఇళ్లకు వెళ్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌ఓ, తదితరులు పరామర్శించారు. నిన్న (జనవరి 21) పశ్చిమ గోదావరి జిల్లా పూళ్లలో వింత వ్యాధితో ఒకరు చనిపోయారు. ఇటీవల వింత వ్యాధితో పంట పొలాల్లో పడిపోయిన బుల్లబ్బాయ్ అనే వ్యక్తి చనిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను ప్రాణాలు కోల్పోయాడు. అతడు గుండెపోటుతో చనిపోయాడని వైద్యులు చెప్పారు. ఇటీవల పొలంలో పనిచేస్తున్న రైతు బుల్లబ్బాయ్ ఉన్నట్టుండి పొలంలోనే పడిపోయాడు. దీంతో అతడిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఈ రోజు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

  మరోవైపు పశ్చిమలో వింత వ్యాధి గురించి గతంలో నాలుగు రోజులు హడావిడి చేసి వదిలేశారని, ఇప్పుడు దాని గురించే పట్టించుకోవడం లేదంటూ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ‘పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి జాతీయస్థాయిలో సంచలనం అయ్యేసరికి నాలుగురోజులు హడావిడి చేసారు. తర్వాత వదిలేసారు. అదిప్పుడు జిల్లాలోని దెందులూరు మండలం కొమిరేపల్లికి పాకింది. కుట్ర రాజకీయాలు, వ్యవస్థలను నాశనం చేసేవాటి మీద పెట్టే శ్రద్ధ, పాలకులు ప్రజారోగ్యం మీద పెట్టాలి. కొమిరేపల్లి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా ఉందని ప్రజలు అంటున్నారు. ప్రభుత్వం ప్రజలకు సురక్షితమైన తాగునీరు కూడా ఇవ్వలేకపోతోంది. పాలన అంటే ప్రజల జీవితాలను మార్చగలగాలి. కానీ వైసీపీ పాలనలో ప్రజలు తాము ప్రాణాలతో ఉంటే చాలు అనుకునే పరిస్థితిలో ఉన్నారు.’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

  మరోవైపు పూళ్ళలో అంతుచిక్కని వ్యాధికి సంబంధించి శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. వెంటనే వెళ్ళి పరిస్థితిని పరిశీలించాలని సీఎస్ ఆదిత్యా నాధ్ దాస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో సీఎస్ ఇతర అధికారులు హుటాహుటిన ఏలూరు బయలుదేరి వెళ్ళారు. ఈ అంశానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖను ప్రభుత్వం పూర్తి అప్రమత్తం చేయడంతో నిరంతరం పర్యవేక్షించాలని జగన్ ఆదేశించారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. సీఎస్ ఆదిత్య నాధ్ దాస్ తోపాటు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, శాఖ కమీషనర్లు ఏలూరు పూళ్ళ ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించనున్నారు.

  గతంలో ప్రాథమిక రిపోర్టులు ఏం చెప్పాయి?
  గతంలో కూడా వింత వ్యాధి ఏలూరు వాసులను తీవ్రంగా భయపెట్టింది. అప్పట్లో పలు సంస్థలు అక్కడ టెస్టులు చేశాయి. ఆ సంస్థల ప్రాథమిక రిపోర్ట్స్ ప్రకారం వ్యవసాయానికి భారీగా పురుగుల మందులు వాడటమే కారణమని పేర్కొన్నాయి. వింత వ్యాధి బారిన పడిన బాధితుల రక్తంలో సీసం, నికెల్ ఉన్నట్టుగా ఎయిమ్స్ తెలిపింది. మరికొన్ని సంస్థలు మాత్రం బాధితులు తీసుకున్న ఆహారంలో పురుగుల మందు వంటి రసాయనాల అవశేషాలు ఉన్నట్టుగా ప్రాథమిక పరిశోధన ఫలితాల్లో వెల్లడించాయి. ఈ ఫలితాలను స్థానికులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆహారంలో రసాయనాలు ఉండటం భవిష్యత్తులో తమపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని భయపడిపోతున్నారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Andhra Pradesh, Eluru, West Godavari

  తదుపరి వార్తలు