Home /News /andhra-pradesh /

Mystery Disease: ఆ ఊరికేమైంది..? పిల్లలే ఎందుకు చనిపోతున్నారు..! ఆ మహమ్మారి కారణమా..?

Mystery Disease: ఆ ఊరికేమైంది..? పిల్లలే ఎందుకు చనిపోతున్నారు..! ఆ మహమ్మారి కారణమా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని పశ్చిమగోదావరి జిల్లా (West Godavari District) కొయ్యలగూడెం మండలం బోడిగూడెం గ్రామంలో చిన్నపిల్లలు వరుసగా చనిపోవడం కలకలం రేపుతోంది.

  అదో చిన్నగ్రామం. వేలల్లో జనాభా.. పొలం పనులు చేసుకునే జనం.. నవ్వుతూ స్కూళ్లకు వెళ్లే చిన్నపిల్లలు. కానీ ఆ గ్రామంలో నెలరోజులుగా ఏ విద్యార్ధి తల్లిదండ్రులను చూసినా ఆందోళనే కనిపిస్తోంది. తమ పిల్లాడికి ఏమైనా అవుతుందేమోనన్న భయం. కారణం నెలరోజులు వ్యవధిలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. అనారోగ్యమో.. విషజ్వరమో.. అంతుచిక్కని జబ్బో తెలియదుగానీ తొలుత మంచం పట్టడం.. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే తనువు చాలించడం జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని పశ్చిమగోదావరి జిల్లా (West Godavari District) కొయ్యలగూడెం మండలం బోడిగూడెం గ్రామంలో చిన్నపిల్లలు వరుసగా చనిపోవడం కలకలం రేపుతోంది. చిన్నపాటి జ్వరం రావడం డాక్టర్ కు చూపించి మందులేసుకున్నా రోజుల వ్యవధిలోనే చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అసలేం జరుగుతుందో తెలియక గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు.

  ఇలా 36 రోజుల వ్యవధిలో ఒకే వయసున్న నలుగురు విద్యార్థులు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ఉంది. స్కూల్లో 6వ తరగతి చదువుతున్న పేరిబోయిన రామాంజనేయులు అనే విద్యార్థికి జ్వరం వచ్చింది. రోజుల వ్యవధిలోనే ఆరోగ్యం విషమించి చనిపోయాడు. నవంబర్ 25న తొమ్మిదో తరగతి విద్యార్థి జక్కు శ్రీను, ఆ తర్వాతి రోజు ఎనిమిదో తరగతి విద్యార్ది కాటుబోయిన ప్రశాంత్ అనారోగ్యంతో మృతి చెందారు. ఇటీవల పదో తరగతి చదువుతున్న మధుకు తొలుత జ్వరం వచ్చింది. ఎంతకీ తగ్గకపోవడంతో రాజమండ్రిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 4న మృతి చెందాడు.

  ఇది చదవండి: విశాఖలో కలకలం.., ముందుకొచ్చిన సముద్రం.. కుంగిన భూమి.. కారణం ఇదేనా..?


  ప్రస్తుతం బోడిగూడెం గ్రామంలో దాదాపు 50 మంది విద్యార్థులు జ్వరంతో మంచం పట్టారు. ఇలా విద్యార్థులు అనారోగ్యానికి గురికావడంతో గ్రామస్థులంతా కలిసి స్కూల్ ను మూయించేశారు. పరిస్థితులు చక్కబడే వరకు తమ పిల్లల్ని పంపించేది లేదని తల్లిదండ్రులు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే వైద్యాశాఖ అధికారులు గ్రామానికి వెళ్లి ఆరా తీయగా.. పిల్లలకు వచ్చిన అనారోగ్యమేంటనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.

  ఇది చదవండి: స్కూల్లోనే మందుకొట్టిన స్టూడెంట్స్.. లంచ్ బ్రేక్ లో సిట్టింగ్.. విద్యార్థి చెప్పిన సమాధానానికి అంతా షాక్..


  ఆస్పత్రుల్లో చేసిన టెస్టుల్లో డెంగీ అని తేలినా.. వైధ్యాధికారులు మాత్రం అదేం లేదంటున్నారు. ఐతే గ్రామంలో దాదాపు 50 మంది పిల్లలు మంచాన పడటంతో ఎప్పుడు ఏం జరుగుతోందనని స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. ఐతే గ్రామంలో పారిశుధ్యం సరిగా లేదని.. డ్రెయినేజీలు శుభ్రం చేయాలని ఎన్నిసార్లు మొత్తుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొందరు మాత్రం గ్రామానికి ఏదో ఆవహించిందని.. పిల్లల్ని బలి తీసుకుంటుదని మూఢనమ్మకాలను కూడా ఆశ్రయిస్తున్నట్లు సమాచారం.

  ఇది చదవండి: పిల్లలకు మొబైల్ ఇస్తే ఎంత ప్రమాదమో చూడండి.. ఏకంగా తల్లిదండ్రులనే..


  గత ఏడాది ఇదే సమయంలో ఏలూరులో వింత వ్యాధి వ్యాపించిన సంగతి తెలిసిందే..! ఐతే ఇక్కడ తొలుత జ్వరం రావడం ఆ తర్వాత రోజుల మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. ఐతే కొందరు విద్యార్థులు మాత్రం వారం, రెండు వారాల చికిత్స అనంతరం కోలుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Dengue fever, West Godavari

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు