హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Mystery Deaths: ఏపీలో మిస్టరీ మరణాలు.. రెండు రోజుల్లో 15 మంది మృతి.. కారణం ఇదేనా..?

Mystery Deaths: ఏపీలో మిస్టరీ మరణాలు.. రెండు రోజుల్లో 15 మంది మృతి.. కారణం ఇదేనా..?

నిన్న ఒక్కరోజే కరోనా మహమ్మారి వల్ల 54 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 5,26,312 మంది కొవిడ్ వ్యాధికి బలయ్యారు. దేశంలో మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)

నిన్న ఒక్కరోజే కరోనా మహమ్మారి వల్ల 54 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 5,26,312 మంది కొవిడ్ వ్యాధికి బలయ్యారు. దేశంలో మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మిస్టరీ మరణాలు కలకలం రేపుతున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలో ఏకంగా 15 మంది హఠాత్తుగా చనిపోవడం అనుమానాలకు తావిస్తోంది.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మిస్టరీ మరణాలు కలకలం రేపుతున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలో ఏకంగా 15 మంది హఠాత్తుగా చనిపోవడం అనుమానాలకు తావిస్తోంది. చిన్నపాటి నలతగా ఉండటం ఆస్పత్రికి వెళ్లిన గంటల్లోనే చనిపోవడం వంటి ఘటనలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) జంగారెడ్డి గూడెంలో రెండు రోజుల వ్యవధిలో 15 మంది మృతి చెందారు. వీరిలో పది మందికి పైగా 40- నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్నవారే ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్నవారు ఉన్నట్లుండి అస్వస్థతకు గరికావడం సమస్య ఏంటో గుర్తించేలోపే ప్రాణాలు కోల్పోవడం జరగుతోంది. దీంతో వారి కుటుంబాలు తీరని విషాదంలో మునిగిపోతున్నాయి.

  మృతులంతా కూలిపనులు, చిన్నచిన్న వృత్తులు చేసుకునేవారే. అస్వస్థతకు గురిన వెంటనే ఆర్ఎంపీలు, స్థానిక డాక్టర్ల దగ్గర ట్రీట్ మెంట్ తీసుకున్న అనంతరం.. పెద్దాస్పత్రులకు వెళ్లిన కొద్దిసేపటికే మృతి చెందారు. ఎక్కువ మంది వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలతోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ మిస్టరీ మరణాల వెనుక కారణాలేంటన్నది ఎవరికీ తెలియడం లేదు. ఐతే కల్తీసారా వీరంతా మృతి చెందినట్లు ప్రచారం జరుగుతోంది. మృతుల్లో చాలా మంది రోజువారి కూలి పనులు చేసుకునేవారు కావడంతో సారా తాగి అస్వస్థతకు గురై ప్రాణాలమీదకు తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. దీనిరై డాక్టర్లుగానీ, అధికారులు గానీ స్పందించలేదు.

  ఇది చదవండి: సరదాగా బీచ్ కు వెళ్లిన ప్రేమజంట.. ప్రియుడ్ని కట్టేసి యువతిపై దారుణం..

  మరోవైపు ఈ మిస్టరీ మరణాలకు నాటుసారానే కారణమని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. ఇవన్నీ ప్రభుత్వ హత్యేలనని... తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. ప్రభుత్వ దుకాణాల్లో నాసిరకం మద్యం విక్రయిస్తూ, మరో వైపు గ్రామాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు నాటు సారా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారని ఆమె మండిపడ్డారు. సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు మద్యపాన నిషేదం అమలు చేసి ఉంటే ఇంతమంది ప్రాణాలు పోయేవా? ఇంతమంది మహిళల మంగళ సూత్రాలు తెగేవా? ‎అని ఆమె ప్రశ్నించారు. మృతుల కుటుంబాలను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని.., ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు.

  ఇది చదవండి: ఇద్దరు మహిళలతో ఏఎస్ఐ రాసలీలలు.. వారిలో ఒకరి హత్యకు స్కెచ్.. చివరకు ఇలా చిక్కాడు

  ఇదిలా ఉంటే 2020 డిసెంబర్లో ఏలూరులో వ్యాపించిన వింత వ్యాధితో పలువురు మృతి చెందిన సంగతి తెలిసిందే. రెండు, మూడు రోజుల వ్యవధిలోనే వందలాది మంది వాంతులు, ఇతర లక్షణాలతో ఆస్పత్రుల పాలయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఆ ఘటనకు కూరగాయలు, ఆహారపదార్థాలపై ఉన్న పురుగుమందుల అవశేషాలేనని నిపుణులు తేల్చారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, West Godavari

  ఉత్తమ కథలు