ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో ఫైబర్ రాకెట్లు కలకలం సృష్టిస్తున్నాయి. రెండు రోజుల్లో రెండు రాకెట్లు కొట్టుకురావడంతో తీరప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ రాకెట్లు ఎక్కడివి.. ఎవరు ప్రయోగించారనేది సస్పెన్స్ గా మారింది. ప్రకాశం జిల్లా రామాయపట్నం పల్లెపాలెం గెస్ట్ హౌస్ సమీపంలో సముద్రం నుంచి ఫైబర్ రాకెట్ కొట్టుకొచ్చింది. రాకెట్ భాగంపై BANSHEE అక్షాలు, 7143 నంబర్లు రాసి ఉన్నాయి. అలాగే రాకెట్ బాడీ ఎరుపు రంగులోనూ.., రెక్కలు పసుపు రంగులోనూ ఉన్నాయి. దీనిని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. వీటిని ఒడిశాలోని ఒడిశాలోని బాలాసోర్ ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ రేంజ్ నుంచి దీన్ని ప్రయోగించి ఉంటారని తహసీల్దార్ తెలిపారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని ఊటుకూరు పెద్దపాలెం వద్ద సముద్రం ఒడ్డుకు శనివారం ఫైబర్ రాకెట్ కొట్టుకొచ్చిన విషయం తెలిసిందే.
అసలు విషయం ఇదే..
నెల్లూరు జిల్లా పెదపాళెం తీరంలో బయటపడింది జెట్ విమాన శకలం కాదని, ఎయిర్‌ఫోర్స్ మిస్సైల్ అని మెరైన్ అధికారులు నిర్థారించారు. దీన్ని సముద్రంపై ఎంత ఎత్తులో గాలి ఉంటుందో తెలుసుకునేందుకు ఉపయోగిస్తారని తెలిపారు. ఇలాంటివి 3 ప్రయోగించగా, ఇప్పటికి 2 లభించాయని, తాజాగా విడవలూరు మండల తీర ప్రాంతంలో మరొకటి లభించిందన్నారు. దీన్ని ఇస్కపల్లి మెరైన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి మెరైన్ అధికారులకు సమాచారమిచ్చామని, త్వరలోనే వారు దీనిని తీసుకువెళతారని చెప్పారు.
తమిళనాడులోని పళవేర్కాడులో ఓ ఫైబర్ రాకెట్‌ను ఒడ్డున జాలర్లు గమనించారు. రక్షణ శాఖ, వాతావరణ శాఖ తరచూ ఇలాంటి ఫైబర్ రాకెట్లను ప్రయోస్తుంటారు. రాకెట్ల సమాచారం విన్న వెంటనే స్థానిక పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఇవి నిజంగా రక్షణ శాఖకు చెందిన వారే ప్రయోగించారా లేక మరేదైనా కారణమాని ఆందోళన చెందారు. చివరకు మెరైన్ అధికారులు స్పష్టత ఇచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, Bay of Bengal, Nellore Dist, Prakasham dist