హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Mysterious Animal: ఏపీలో వింత జంతువు కలకలం.. హడలిపోతున్న రైతులు.. అధికారుల హెచ్చరిక..

Mysterious Animal: ఏపీలో వింత జంతువు కలకలం.. హడలిపోతున్న రైతులు.. అధికారుల హెచ్చరిక..

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వింత జంతువు కలకలం రేపుతోంది. పశువులపై దాడి చేస్తూ రైతులను బెంబేలెత్తిస్తోంది. అధికారులకు కూడా అదే జంతువో తెలియడం లేదు. అటవీ ప్రాంతం నుంచి తప్పిపోయి వచ్చిందా.. లేక ఇక్కడే పెరుగుతోందా అనేది తెలియదుగానీ జంతువు కదలికలు తెలిసి జనం హడలిపోతున్నారు.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వింత జంతువు కలకలం రేపుతోంది. పశువులపై దాడి చేస్తూ రైతులను బెంబేలెత్తిస్తోంది. అధికారులకు కూడా అదే జంతువో తెలియడం లేదు. అటవీ ప్రాంతం నుంచి తప్పిపోయి వచ్చిందా.. లేక ఇక్కడే పెరుగుతోందా అనేది తెలియదుగానీ జంతువు కదలికలు తెలిసి జనం హడలిపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లా (Kakinada District) ప్రత్తిపాడు మండలం ఒమ్మంది, పోతులూరు గ్రామ శివారులో వింత జంతువు సంచరిస్తోంది. కొన్నిరోజులుగా గేదెలపై దాడులు చేస్తూ వాటిని చంపి తినేస్తోంది. ఈ ప్రాంతం లో పది పశువుల పై దాడి చేసి ఇప్పటికే ఆరు గేదెలను చంపేసింది. స్థానికులిచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు దాని జాడ కనుగొనేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే ఒమ్మంగి, పోతులూరు గ్రామాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు.

అలాగే ఆ జంతువును గుర్తించేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి ఐ.వి.కె రాజు మీడియాకు తెలిపారు. పోతులూరు, ఒమ్మంగి ప్రాంతాల్లో రైతులు ఒంటరిగా పొలాల్లోకి వెళ్లొద్దని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. జంతువు పాదముద్రలను సేకరించామని.. వాటి ఆధారంగా అది జంతువనేది గుర్తించడం కష్టంగా మారిందన్నారు. పాదముద్రల  ఫోటోలను నిపుణులకు పంపిచామని ఒకటి రెండు రోజుల్లో పూర్తి వివరాలు తెలుస్తాయని తెలిపారు.

ఇది చదవండి: క్యాట్ వాక్ గురించి తెలుసు.. మరి బర్డ్ వాక్ అంటే ఎంటో తెలుసా..?


పశువులను వేటాడుతున్న తీరు చూస్తే ఆ జంతువు ప్రమాదకరమైందని.., చాలా బలమైందని కూడా తెలుస్తోందని ఐవీకే రాజు తెలిపారు. ఐతే రాత్రుళ్లు ప్రజలు బయటకు రావొద్దని.. తెల్లవారుజామున కూడా ఇళ్లలోనే ఉండాలని ఆయన సూచించారు. పశువులను మేపేందుకు వెళ్లిన వారు వాటిని దగ్గరగా పరిశీలించాలన్నారు. ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన అధికారులు.. జంతువు కదలికలను గుర్తిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు.

ఇది చదవండి: అరుదైన పక్షులన్నీ ఒకే చోట.. అక్కడికెళ్తే ఎగిరి గంతేస్తారు.. సమ్మర్లో పిల్లల్ని తీసుకెళ్లడానికి బెస్ట్ ప్లేస్ ఇదే..!


ఐతే చిరుత పులి, ఎలుగుబంటి లేదా నక్కలు, అడవి కుక్కల వంటివి అయి ఉండొచ్చన్న ప్రచారం స్థానికంగా జరుగుతోంది. వొమ్మంగి శివారలో చిన్నపాటి కొండప్రాంతం ఉండటంతో అక్కడేమైనా అడవి జంవులున్నాయా అనే దానిపై అధికారులు గాలిస్తున్నారు. గ్రామ శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరాల్లో జంతువు దృశ్యాలు చిక్కే అవకాశముంది.


ఇది చదవండి: ఈ కోళ్లను కొనాలంటే ఆస్తులమ్ముకోవాలి.. వాటికున్న డిమాండ్ అలాంటిది మరి.. మీరే చూడండి..!


ఇదిలా ఉంటే గత ఏడాది కోనసీమ ప్రాంతంలో వింత జంతువులు హల్ చల్ చేశాయి. రాత్రుళ్లు పొలాల్లో సంచరిస్తుండటం, చేతికి చిక్కకపోవడంతో వింత జంతువులన్న కలకలం రేగింది. ఐతే అధికారులు వాటిని గుర్తించి సీ అట్టర్స్ గా తేల్చారు. ప్రత్తిపాడులో తిరుగుతున్న జంతువు ఏమై ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.

First published:

Tags: Andhra Pradesh, Kakinada

ఉత్తమ కథలు