Missing Mysterious: మైరెన్‌ ఉద్యోగి మిస్సింగ్ మిస్టరీ.. గర్ల్ ఫ్రెండ్ పై అనుమానాలు

మైరెన్ ఉద్యోగి శ్రీనివాస్ మిస్సింగ్

ఓ మైరెన్ ఉద్యోగి తప్పిపోయి రెండు నెలలు దాటుతోంది. సముద్రంలోనే మిస్సాయ్యాడని అంతా అనుకుంటున్నారు. కానీ తల్లిదండ్రులు మాత్రం అతడు మిస్స్ అవ్వలేదని.. అసలు విషయం అతడి గర్ల్ ఫ్రెండ్ కు తెలుసంటూ ఆరోపిస్తున్నారు.. ఇంతకీ ఏం జరిగింది.

  • Share this:
    మంచి ఉద్యోగం.. చిన్నవయసులోనే గుర్తింపు.. కుటుంబంలో, బంధువుల్లో, సమాజంలో మంచిపేరు తెచ్చుకున్నాడు. జీవితం  చాలా హ్యాపీగా సాగిపోతోంది.. తల్లి దండ్రులు సైతం కొడుకు ఉన్నత భవిష్యత్తు హ్యాపీగా ఉంటుంది అనుకుంటూ చాలా సంతోషంగా ఉండేవారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మిస్‌ అయ్యాడు. అతడి మిస్సై దాదాపు 2 నెలలు దాటుతోంది. కానీ ఇప్పటి వరకు ఆచూకీ దొరకడం లేదు. గుంటూరుకు చెందిన మైరెన్‌ ఉద్యోగి శ్రీనివాస్‌ చెన్నైలోని సీనర్జీ మారిటైమ్ కంపెనీలో సెయిలర్‌గా పనిచేస్తున్నాడు. ప్రతి రోజులాగే డ్యూటీకి అని వెళ్లిన ఆయన.. విధుల్లో ఉండగానే అంటే మే 24 నుంచి  కనిపించడంలేదని ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  శ్రీనివాస్ మిస్సింగ్ పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అతడి తల్లి దండ్రులు. వైజాగ్‌కు చెందిన ఓ యువతితో శ్రీనివాస్‌కు కొంతకాలంగా పరిచయం ఉందని, ఆమెతో ఇప్పటికీ టచ్‌లో ఉన్నాడని ఆరోపిస్తున్నారు. ఆ యువతితోపాటు శ్రీనివాస్‌ మిత్రుడు రాజేంద్రకు ఆచూకీ గురించి తెలుసని శ్రీనివాస్‌ కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా సమర్పించామని వారు చెబుతున్నారు. వారిద్దర్నీ విచారిస్తేనే తమ కొడుకు ఆచూకీ దొరుకుతుంది అంటున్నారు. ఆ దిశగా విచారణ చేయాలని కోరుతున్నారు.

    మరోవైపు సముద్రంలో ఉన్నప్పుడు మిస్‌ అయ్యాడు కాబట్టి పోలీసులు కేసు నమోదు చేయలేదు. మరోవైపు అతను పనిచేసిన కంపెనీ కూడా ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపింది. కానీ రెండు నెలలు గడుస్తున్నా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని శ్రీనివాస్ కుటుంబసభ్యులు చెబుతున్నారు. అటు పోలీసులు, ఇటు ప్రజాప్రతినిధుల చుట్టు తిరిగి కాళ్ల అరిగిపోయాయని, కానీ ఫలితం మాత్రం శూన్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రీనివాస్‌ కుటుంబసభ్యులు.

    శ్రీనివాస్ మిస్సింగ్‌పై ఆ వైజాగ్‌ యువతి అతని కుటుంబసభ్యులపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి కావాల్సిన తమవాడు కనిపించకుండా పోవడం, రెండు నెలలైనా ఎలాంటి సమాచారం లేకపోవడంతో శ్రీనివాస్‌ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు, నేతలు స్పందించి శ్రీనివాస్‌ ఆచూకీ కనుగొనేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. పోలీసులకు తమవద్ద సమాచారం ఇచ్చామని చెబుతున్నారు. మరి ఈ కేసు విషయంలో పోలీసులు ఎలా ముందుకెళ్తారన్నది చూడాలి..
    Published by:Nagesh Paina
    First published: