వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పాలాభిషేకం

నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ముస్లిం మైనారిటీలు పాలాభిషేకం చేశారు.

news18-telugu
Updated: March 4, 2020, 7:01 PM IST
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పాలాభిషేకం
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ముస్లింలు లాభిషేకం
  • Share this:
నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ముస్లిం మైనారిటీలు పాలాభిషేకం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి కటౌట్ లతో పాటు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. అనంతరం ముస్లిం సంప్రదాయ అలంకరణలో ఎమ్మెల్యే కోటంరెడ్డిని సత్కరించారు. ఎన్పీఆర్‌లో మార్పులు చేయాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మైనారిటీలు కోటంరెడ్డిని సన్మానించారు.

ఎన్పీఆర్‌లో మార్పులు చేసేంతవరకు దాన్ని ఏపీలో అమలు చేయబోమని సీఎం జగన్ స్పష్టం చేశారు. దీంతోపాటు అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలని ఈ రోజుకేబినెట్‌లో నిర్ణయించారు. దీంతో ముస్లిం మైనారిటీలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మైనారిటీలు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అభినందన సభ ఏర్పాటు చేశారు. తొలుత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్ మోహన్ రెడ్డి కటౌట్లకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యేకు కూడా పాలాభిషేకం చేయాలని ముస్లింలు ప్రయత్నించారు. దీంతో ఎమ్మెల్యే వారి కోరికను కాదనకుండా ఉండలేకపోయారు. ఓ వైపు కొందరు పాలతో అభిషేకం చేస్తుంటే, మరికొందరు పూలతో ముంచెత్తారు.
First published: March 4, 2020, 6:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading