టీవీ9లో ముఖాముఖి ప్రోగ్రామ్ చాలా ఫేమస్. ఆ కార్యక్రమం ద్వారా ఎంతో రాజకీయ నాయకుల అంతరంగాన్ని ఆవిష్కరించారు జాఫర్. సుమారు 175 మంది నేతను ఇంటర్వ్యూ చేసిన ఆయన టీవీ9కి గుడ్‌బై చెప్పారు. తాను టీవీ9కి రాజీనామా చేశానని జాఫర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. టీవీ9కు రాజీనామా చేయడానికి గల కారణాలను చెబుతూ 12 నిమిషాల వీడియోను రూపొందించారు. టీవీ9తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు జాఫర్. టీవీ9తో ఉన్న 15 బంధం తెగిపోయిందని ఎమోషనల్‌గా మాట్లాడారు.
కాగా, బిగ్‌బాస్ తెలుగు 3లోనూ జాఫర్ పాల్గొన్నారు. రెండువారాల తర్వాత షో నుంచి జాఫర్ ఎలిమినేట్ అయ్యారు. టీవీ9 కొత్త మేనేజ్‌మెంట్ చేతుల్లోకి వెళ్లా ప్రక్షాళన మొదలైంది. సీఈవో రవిప్రకాశ్‌పై తొలి వేటు వేసిన యాజమాన్యం.. తాజాగా ఇన్‌పుట్ ఎడిటర్ స్థాయిలో ఉన్న జాఫర్‌ను బయటకు పంపించారు. ప్రస్తుతం ఈ అంశం మీడియా వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
జాఫర్ వీడియో ఇక్కడ చూడండి:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: TV9