ఏపీ రాజధాని తరలింపునకు కొత్త ముహూర్తం ఫిక్స్...?

ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నం తరలించడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: May 28, 2020, 6:26 PM IST
ఏపీ రాజధాని తరలింపునకు కొత్త ముహూర్తం ఫిక్స్...?
వైఎస్ జగన్ (credit - twitter)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నం తరలించడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ రోజు (మే 28)న అమరావతి నుంచి విశాఖకు వెళ్లడానికి ముహూర్తం నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరిగింది. అయితే, కరోనా వైరస్, లాక్ డౌన్ ఇతర కారణాల వల్ల అది వాయిదా పడింది. ఈ క్రమంలో రాజధాని తరలింపునకు మరో కొత్త ముహూర్తం ఫిక్స్ చేశారు. విశాఖ శారదాపీఠం స్వామి స్వరూపానందేంద్ర ఈ కొత్త ముహూర్తాన్ని ఫిక్స్ చేసినట్టు డెక్కన్ క్రానికల్ కథనాన్ని ప్రచురించింది. అక్టోబర్ 25న అమరావతి నుంచి విశాఖకు రాజధానిని తరలించడానికి ఆయన ముహూర్తం ఖరారు చేసినట్టు తెలిపింది. అక్టోబర్ 25 అంటే ఆ రోజు విజయదశమి. ఆదివారం. ఆదివారం ఉదయం 7.31 గంటలకు దశమి తిథి మొదలై.. సోమవారం ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. దీంతో ఆ ముహూర్తంలోనే విశాఖ నుంచి జగన్ పాలనను ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసినట్టు తెలిసింది. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం కార్యక్రమానికి కూడా ఆయనే ముహూర్తం ఖరారు చేశారు. స్వరూపానందేంద్ర చెప్పినందువల్లే జగన్ అమరావతి నుంచి విశాఖకు వెళ్తున్నారనే ప్రచారం కూడా ఉంది. విజయదశమి పర్వదినం. ఆ రోజు చేపట్టే పని దిగ్విజయం అవుతుందని నమ్మకం. అప్పటి వరకు రాజధానికి సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయని సీఎం జగన్‌కు స్వరూపానందేంద్ర స్వామి ధైర్యం చెప్పినట్టు తెలిపింది.

అయితే, ఆ వార్తను శారదాపీఠం ఖండించింది. ‘రాజధాని తరలింపునకు సంబంధించి విశాఖ శారదాపీఠం ముహూర్తం ఖరారు చేసినట్లు డెక్కన్ క్రానికల్ దినపత్రికలో వచ్చిన వార్త అవాస్తవం.’ అని ఫేస్ బుక్ పేజీలో ప్రకటించింది.

First published: May 28, 2020, 5:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading