• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • MUDRAGADA PADMANABHAM LETTER TO CM YS JAGAN MOHAN REDDY ON KAPU RESERVATION AK

జగన్‌కు ముద్రగడ లేఖ... వార్నింగ్‌తో కూడిన విజ్ఞప్తి

జగన్‌కు ముద్రగడ లేఖ... వార్నింగ్‌తో కూడిన విజ్ఞప్తి

వైఎస్ జగన్, ముద్రగడ పద్మనాభం(ఫైల్ ఫోటో)

కాపు రిజర్వేషన్ల అంశం సమంజసమైనదనే జగన్ గతంలో చెప్పారని ముద్రగడ గుర్తు చేశారు.

  • Share this:
    తమ జాతి సమస్యను తీర్చాలని ప్రధాని మోదీని కోరాలని సీఎం జగన్‌ను కోరారు కాపు రిజర్వేషన్ల ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం. అడిగిన వారికి, అడగని వారికి దానాలు చేసి దాన కర్ణుడు అనిపించుకుంటున్న సీఎం జగన్... కాపు రిజర్వేషన్లను సాధించే విషయంలో ఎందుకు చేతులు రావడం లేదని ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయంలో కాపు జాతి మద్దతు ఉందని ఆయన అన్నారు. కాపు రిజర్వేషన్ల అంశం సమంజసమైనదనే జగన్ గతంలో చెప్పారని ముద్రగడ గుర్తు చేశారు.దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలో జగన్ కూడా పూజలందుకోవాలని అంటూనే... పదవిని మూన్నాళ్ల ముచ్చటగా చేసుకోవద్దని వ్యాఖ్యానించారు.

    మొత్తానికి కాపు రిజర్వేషన్ల అంశంపై వైసీపీ ప్రభుత్వాన్ని ముద్రగడ పద్మనాభం తొలిసారిగా కాస్త గట్టిగా డిమాండ్ చేయడం రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
    First published:

    అగ్ర కథనాలు