కాపు ఉద్యమానికి గుడ్ బై.. ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం

కాపు ఉద్యమానికి గుడ్ బై.. ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం

ముద్రగడ పద్మనాభం(ఫైల్ ఫోటో)

ఉద్యమంతో ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్యపరంగా నష్టపోయానని ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు.

  • Share this:
    కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నానని ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆయన కాపులకు బహిరంగ లేఖ రాశారు. సోషల్ మీడియాలో తనపై దాడులు చేస్తున్నారని ఆయన అన్నారు. తనను కులద్రోహి అంటూ విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు కారణంగానే తాను ఉద్యమంలోకి వచ్చానని ఆయన అన్నారు. ఉద్యమంతో ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్యపరంగా నష్టపోయానని ముద్రగడ వ్యాఖ్యానించారు. అనేకమంది మేధావులతో కలిసి ఉద్యమం నడిపానని అన్నారు. బంతిని కేంద్రం కోర్టులో వేశాననడం బాధించిందని ముద్రగడ వివరించారు. సందర్భాన్ని బట్టి ఉద్యమం రూపు మారుతుంటుందని ఆయన...కాపు జాతికి మేలు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశానని అన్నారు.

    పది రోజుల క్రితం కాపుల సమస్యను తీర్చేందుకు ప్రధాని మోదీని కోరాలని సీఎం జగన్‌ను కోరారు ముద్రగడ పద్మనాభం. అడిగిన వారికి, అడగని వారికి దానాలు చేసి దాన కర్ణుడు అనిపించుకుంటున్న సీఎం జగన్... కాపు రిజర్వేషన్లను సాధించే విషయంలో ఎందుకు చేతులు రావడం లేదని ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయంలో కాపు జాతి మద్దతు ఉందని ఆయన అన్నారు. కాపు రిజర్వేషన్ల అంశం సమంజసమైనదనే జగన్ గతంలో చెప్పారని ముద్రగడ గుర్తు చేశారు.దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలో జగన్ కూడా పూజలందుకోవాలని అంటూనే... పదవిని మూన్నాళ్ల ముచ్చటగా చేసుకోవద్దని వ్యాఖ్యానించారు. పది రోజుల క్రితం సీఎం జగన్‌కు లేఖ రాసిన ముద్రగడ పద్మనాభం... ఇంతలోనే ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
    Published by:Kishore Akkaladevi
    First published: