LS Speaker: ఎంపీ రఘురామపై అనర్హత వేటు లేనట్టేనా..? లోక్ సభ స్పీకర్ తీరుపై వైసీపీ అసహనం

లోక్ సభ స్పీకర్ ను కలిసిన ఎంపీ విజయసాయి రెడ్డి ఇతర ఎంపీలు

MP Vijayasia Reddy Shocking Comments: ఎంపీ రఘురామ పై అనర్హత వేటు లేనట్టేనా..? వైసీపీ ఎంపీల ప్రయత్నాలు ఏవీ ఫలించలేదా..? తాజాగా ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చూస్తే ఇలాంటి అనుమానాలే కలుగుతున్నాయి.

 • Share this:
  MP Vijayasai Reddy Comments on Loksabha Speaker: ఏపీలో అధికార పార్టీకి రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తలనొప్పి పెరిగింది. ఓ వైపు జగన్ బెయిల్ రద్దు చేయాలని న్యాయపోరాటం చేస్తున్నారు. మరోవైపు జాతీయ స్థాయిలో వైసీపీకి వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్నారు. ఎంపీ అయిన తననే విచారణ పేరు చెప్పి, పోలీసులతో కొట్టించారు అంటూ అందరికీ లేఖలు రాశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఇది పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే చాలామంది ఎంపీలు రఘరామకు మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది. ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న లోక్ సభ సమావేశాల్లో కచ్చితంగా ఇదే అంశాన్ని తెరపైకి తీసుకురావాలని రఘురామ పట్టుదలతో ఉన్నారు. అదే జరిగితే జాతీయ స్థాయిలో వైసీపీకి డ్యామేజ్ తప్పదు. సొంత పార్టీ ఎంపీ ఆరోపణలు చేయడం.. అది కూడా ఆయనను పోలీసులు గాయపర్చడం ఇవ్వన్నీ జగన్ సర్కార్ కు డ్యామేజ్ కలిగించే అంశాలే. అందుకే ఆయనను త్వరగా పార్టీ నుండి సస్పెండ్ చేయించేలా చూడాలని వైసీపీ ఎంపీలు ఆరాటపడుతున్నారు. పదే పదే లోక్ సభ స్పీకర్ ను కలిసి వినతులు అందిస్తున్నారు. రఘురామపై వేటు వేయాలని కోరుతున్నారు. కానీ తాజా పరిస్థితులు చూస్తుంటే స్పీకర్ నిర్ణయం వైసీపీకి షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది..

  గురువారం సాయంత్రం మరోసారి వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు ఆ పార్టీ ఎంపీలు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని డిమాండ్ చేస్తూ ఓంబిర్లాకు విజయసాయిరెడ్డి ఇటీవల లేఖ కూడా రాశారు. ఇప్పుడు నేరుగా వైసీపీ ఎంపీలు విజయసాయి, మిథున్ రెడ్డి, భరత్ స్పీకర్ ను మరోసారి కలిశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు రఘురాజు పాల్పడుతున్నారని మరిన్ని ఆధారాలను స్పీకర్ కు అందజేశారు. వెంటనే రఘురాజుపై అనర్హత వేటు వేయాలని కోరారు.

  ఇదీ చదవండి: పార్టీ ప్రకటన తొలి రోజే జగన్ కు షర్మిల రివర్స్ పంచ్.. అన్నపై విమర్శలు..!

  స్సీకర్ ను కలిసి తరువాత మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రఘురామ తీరుపై ఫైర్ అయ్యారు. వైసీపీ టికెట్ మీద గెలిచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు రఘురాజు పాల్పడుతున్నారని స్పీకర్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు. గతంలో కూడా దీనికి సంబంధించిన ఆధారాలను స్పీకర్ కు అందించామని తెలిపారు. రఘురాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని మరోసారి కోరామని చెప్పారు. దీనిపై స్పీకర్ సనుకూలంగా స్పందించారని.. కచ్చితంగా రఘురామపై వేటు వేస్తారంటూ మాట్లాడారు..

  ఇదీ చదవండి: గంటాను టీడీపీ పెద్దలు పక్కన పెట్టారా..? భీమిలి, నార్త్ నియోజవర్గాలపై ఆ ఇద్దరూ ఫోకస్

  కానీ ఇంతలో ఏమైందో కొన్ని గంటల్లోనే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వెర్షన్ మారింది. లోక్ సభ స్పీకర్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఎంపీ రఘురామ కృష్ణరాజు పై అనర్హత వేటు వేయాల్సిందేనని డిమాండ్ చేసిన ఆయన.. స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది క్రితం నుంచి ఆయనపై అనర్హత వేటు పరిశీలన జరుగుతూనే ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ననుసరించి రఘురామపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే ఎలా అంటూ హాట్ కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన వ్యాఖ్యలు చూస్తే రఘు రామ పై వేటు వేసే అవకాశం లేదని తెలుస్తోంది.
  Published by:Nagesh Paina
  First published: