chandrababu-Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhar Pradesh Politics) ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఉప్పు నిప్పులా ఉండే వారిద్దరు కలుసుకున్నారు. వారిద్దరు ఎవరో కాదు తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) .. ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. చంద్రబాబు పేరు వింటే చాలు విజయసాయి రెడ్డి తీవ్రంగా మండిపడతారు.. అలాంటి విజయసాయి రెడ్డి ఇవాళ చంద్రబాబును కలిశారు.. ఆప్యాయంగా మాట్లాడారు. రాజకీయం వేరు.. బంధుత్వం వేరు అనడానికి వీరిద్దరి కలియకే ఒక నిదర్శనం.. ఎందుకంటే తారాకరత్నకు ఎంపీ విజయసాయి రెడ్డి దగ్గుర బంధువు.. అందుకే ఆయనకు నివాళులర్పించేందుకు వచ్చిన విజయసాయి రెడ్డి.. అక్కడే ఉన్న చంద్రబాబు పక్కన కూర్చొని కాసేపు మాట్లాడారు.. కారణం ఏదైనా వీరిద్దరూ కలిసి పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకోవడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
వీరిద్దరి కలియకకు ప్రధాన కారణం ఏంటంటే..? సినీనటుడు నందమూరి తారకరత్న నిన్న రాత్రి బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఇవాళ ఉదయం తారకరత్న పార్థీవదేహం హైద్రాబాద్ కు తీసుకు వచ్చారు. నగరంలోని మోకిళ్లలోని తారకరత్న నివాసంలో పార్థీవదేహం ఉంచారు. తారకరత్నకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు , ఆయన భార్య భువనేశ్వరి నివాళులర్పించారు. ఈ సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా అక్కడే ఉన్నారు. తారకరత్న బౌతికకాయం వద్ద నివాళులర్పించిన తర్వాత చంద్రబాబునాయుడు , విజయసాయిరెడ్డి పక్కపక్కనే కూర్చున్నారు. కొద్దిసేపు మాట్లాడుకున్నారు.
నిత్యం ఉప్పు, నిప్పుగా ఉండే వీరిద్దరూ పక్కనే పక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఆ తరువాత చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడే సమయంలో సైతం.. ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబు పక్కనే ఉన్నారు. మీడియా సమావేశం ముగిసిన తర్వాత వెళ్లిపోయే ముందు చంద్రబాబునాయుడు విజయసాయిరెడ్డిని పిలిచి వెళ్తున్నట్టుగా చెప్పారు. ఇద్దరూ ఒకరికొకరు నమస్కారాలు చేసుకున్నారు. చంద్రబాబునాయుడు కారు దగ్గర టీడీపీ తెలంగాణ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి , విజయసాయిరెడ్డి కూడా మాట్లాడుకున్నారు.
తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి బంధువు. విజయసాయిరెడ్డికి అలేఖ్య కూతురు వరుస అవుతుంది. తారకరత్న, అలేఖ్య రెడ్డి ఇద్దరు ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. అది కాస్త ప్రేమగా మారి ఏడడుగుల బంధంతో ఒకటతయ్యారు. వీరికో కూతురు కూడా ఉంది. ఇక తారకరత్న భార్య అలేఖ్య ఈయన హీరోగా నటించిన ‘నందీశ్వరుడు’ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసారు.
ఇదీ చదవండి : ఏప్రిల్ లో ఢిల్లీకి చంద్రబాబు.. బీజేపీ పెద్దలతో సమావేశం.. పొత్తులపై ప్రతిపాదనలు ఇవే..!
తారకరత్న భార్య అలేఖ్యరెడ్డికి ప్రముఖ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత రాజ్యసభ సభ్యుడైన విజయసాయి రెడ్డికి మధ్య బంధుత్వం ఉంది. ఈమె విజయసాయి రెడ్డి భార్య చెల్లెలు కూతురు. ఈయనకు కూతురు వరుస అవుతోంది. అంటే తారకరత్న విజయసాయి రెడ్డికి అల్లుడు వరస అవుతాడు. అందుకే విజయసాయి తారాక రత్నా ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి.. నందమూరి కుటుంబంతో టచ్ లో ఉన్నారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Taraka Ratna, Vijayasai reddy