హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YSRCP: వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు ఉద్యోగాలు కల్పిస్తాం.. ఎంపీ విజయసాయిరెడ్డి

YSRCP: వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు ఉద్యోగాలు కల్పిస్తాం.. ఎంపీ విజయసాయిరెడ్డి

విదేశాలు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని విజయసాయి రెడ్డి పిటిషన్

విదేశాలు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని విజయసాయి రెడ్డి పిటిషన్

ఉత్తరాంధ్రలో ఏపీ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఉద్యోగాలు కల్పిస్తామని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.

ఉత్తరాంధ్రలో ఏపీ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఉద్యోగాలు కల్పిస్తామని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. కార్యనిర్వాహక రాజధాని కాబోతున్న విశాఖ ఫార్మాసిటీలో 84 పరిశ్రమలుండగా ఇందులో 2 వేల ఉద్యోగాలు కార్యకర్తలకు కల్పిస్తామన్నారు. ఆదివారం విశాఖలో ఉత్తరాంధ్ర జిల్లాల ‘వైకాపా సోషల్ మీడియా కార్యకర్తల’ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. కెమిస్టు, మెకానికల్ ఆపరేటింగ్ , క్వాలిటీ కంట్రోల్ బయాలజిస్టు, స్టోర్ మెయింటెనెన్స్ , ఫార్మసీ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు కల్పించేందుకు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఉచిత వసతి కల్పించి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. వారు ఏ కంపెనీలో శిక్షణ తీసుకున్నారో అక్కడే ఉద్యోగం ఇప్పిస్తామన్నారు.

ఐటీ కంపెనీల్లోనూ అవకాశం కల్పిస్తామని, ఇప్పటికే కొన్నింటితో మాట్లాడామన్నారు. ఈ రకంగా చాలామందికి ప్రభుత్వరంగ సంస్థల్లోనూ ఉపాధి చూపుతామన్నారు. ఇందుకోసం సోషల్ మీడియా కార్యకర్తలు తమ వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటే విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఎక్కడ ఏ సంస్థలో అవసరమైతే అందులో ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు అభ్యంతరకర పోస్టులు పెట్టారని 135 కేసులు పెట్టగా 120 కేసులను ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. ఏడు కేసులు కోర్టుల్లో సాగుతున్నాయని, వీటికి పార్టీ నుంచి న్యాయపరమైన సహాయం అందిస్తున్నామన్నారు.

సోషల్ మీడియా కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. ఇక, ఈ కార్యక్రమంలో విజయసాయిరెడ్డితో పాటుగా ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ , మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

First published:

Tags: JOBS, Vijayasai reddy, Visakhapatnam, Ysrcp