Home /News /andhra-pradesh /

MP SUJANA CHOWDARY GAVE POWER POINT PRESENTATION ON AMARAVATI ISSUE NK

జగన్ యూటర్న్ సీఎం... ఎంపీ సుజనాచౌదరి ఫైర్...

సుజనా చౌదరి

సుజనా చౌదరి

Andhra Pradesh : ఏపీలో బీజేపీ రాజధాని అంశంపై తమ నేతలతో వేర్వేరు వ్యాఖ్యలు చేయించినా... ఇప్పుడు స్పష్టమైన క్లారిటీతో ఉంది. అమరావతినే రాజధానిగా ప్రకటించాలన్నట్లుగా డిమాండ్ చేస్తోంది.

    ఏపీ రాజధాని అమరావతిపై బీజేపీ ఎంపీ సుజనాచౌదరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాజధాని అభివృద్ధికి కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చిందన్న ఆయన.... రాజధాని నిర్మాణానికి నిధులు తెచ్చుకోవడంలో గత టీడీపీ ప్రభుత్వం, ఇప్పటి వైసీపీ సర్కార్ ఫెయిలయ్యాయని అన్నారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్న అంశం రాష్ట్ర ప్రభుత్వనిదేనన్న ఆయన... అమరావతి దగ్గర రాజధానిని నిర్మించే అవకాశం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వచ్చిందని గుర్తుచేశారు. రాజధాని నిర్మాణం ఆలస్యం అయినందు వల్లే స్థానిక టీడీపీ ఎమ్మెల్యేని రైతులు ఓడించారన్న సుజనా... టీడీపీ హయాంలో రాజధాని నిర్మాణం కోసం... రూ.5,600 కోట్లు ఖర్చయ్యాయనీ... 130 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు 1,293 ఎకరాలు కేటాయించారని తెలిపారు. ఇలా భూములు కేటాయించినందుకు ఆయా కంపెనీలు... ప్రభుత్వానికి రూ.450 కోట్లు చెల్లించాయని తెలిపారు. విట్, SRM లాంటి సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయన్న ఎంపీ... ఇంత జరిగితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం... మూడు రాజధానులు ఉండొచ్చని ప్రకటించడమేంటని ప్రశ్నించారు. గతంలో ప్రతిపక్ష నేతగా జగన్... రాజధానికి 30,000 ఎకరాలు కావాలనీ, విజయవాడ కేంద్రంగానే రాజధాని ఉండాలని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన అంశాన్ని గుర్తుచేసిన సుజనా... ఇప్పుడు మాట మార్చితే ఎలా అని నిలదీస్తున్నారు. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ మధ్యంతర నివేదికలపై ఆధారపడి రాజధానిని మార్చడమేంటని సుజనా ప్రశ్నిస్తున్నారు.

    ఇటీవల బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాజధాని అమరావతి రైతులకు మద్దతుగా... గంటపాటూ మౌన దీక్ష పాటించారు. ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. మొత్తంగా బీజేపీ... క్లియర్ స్టాండ్ తీసుకుంటోంది. రాజధాని రైతులకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తోంది. రాజధానిని ఎలా మార్చుతారో చూస్తామని అంటోంది. ఒకవేళ ఏపీ ప్రభుత్వం రాజధానిని మూడు ముక్కలుగా చేస్తే, విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చితే... బీజేపీ హైకమాండ్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ... ఏపీ రాజధానిగా అమరావతిని అంగీకరిస్తూ... అమరావతిలో భూమి పూజ చేశారు కాబట్టి... ఏపీ ప్రభుత్వం ఇప్పుడు వేరే నిర్ణయం తీసుకుంటే... ఏపీలో బీజేపీ నేతలు... ఆందోళనలు చేసే అవకాశాలున్నాయి.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Amaravati, Sujana Chowdary

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు