MP SUBRAMANIAN SWAMY DECIDED TO MAKE A TEST CASE OF ONE MEDIA OUTLET IN A DEFAMATION CASE AS BALAJI BHAKT HSN
TTD- MP Subramanian Swamy: టీటీడీపై తప్పుడు ప్రచారాలతో విసిగిపోయా.. ఓ మీడియా సంస్థపై పరువు నష్టం దావా.. సుబ్రహ్మణ్యస్వామి సంచలన ప్రకటన
ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి (ఫైల్ ఫొటో)
తాజాగా టీటీడీ కమిటీలో క్రైస్తవులకు పెద్దపీట వేస్తున్నారంటూ, తిరుమల కొండపై క్రైస్తవ మత ప్రచారం జరుగుతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. ట్విటర్ వేదికగా ఆ ప్రచారాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మతపరంగా కొన్ని విమర్శలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆలయాలపై దాడుల విషయంలోనూ, క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేస్తున్నారంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ తరహా వార్తలను విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. అదే సమయంలో ‘తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ‘ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని ఎంపిక చేసిన సమయంలోనూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. వైవీ సుబ్బారెడ్డి క్రైస్తవుడంటూ విపరీతమైన ప్రచారం జరిగింది. వైసీపీ పెద్దలు పూనుకుని ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ, వైవీ సుబ్బారెడ్డికి సంబంధించిన ఆధారాలను మీడియా ముందుకు తీసుకురావడంతో.. అవన్నీ ఫేక్ అని నిర్ధారణ అయ్యాక ఆ ప్రచారం ఆగిపోయింది.
తాజాగా టీటీడీ కమిటీలో క్రైస్తవులకు పెద్దపీట వేస్తున్నారంటూ, తిరుమల కొండపై క్రైస్తవ మత ప్రచారం జరుగుతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. ట్విటర్ వేదికగా ఆ ప్రచారాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తిరుమల దేవాలయాన్ని క్రైస్తవుల అడ్డాగా టీటీడీ మారుస్తోందంటూ వస్తున్న అవాస్తవ వార్తలతో నాకు విసుగు పుడుతోంది. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ తరహా వార్తలు వచ్చాయి. సీబీఎన్(చంద్రబాబు నాయుడు) ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పొందే మీడియా సంస్థలే ఈ తరహా వార్తలను ప్రచారం చేస్తున్నాయి. ఆ వార్తలకు ఆ మీడియా సంస్థలే పూర్తి బాధ్యత వహించాలి. నేను ఒక భక్తుడిగా ఓ మీడియా సంస్థపై పరువు నష్టం దావాను వేయాలని నిర్ణయించుకున్నా.‘ అంటూ సుబ్రహ్మణ్య స్వామి తన ట్విటర్ ఖాతాలో స్పందించారు.
I am quite fed up getting bogus information that TTD is Christianizing the temple. CBN financed media are responsible. So I have decided to make a test case of one media outlet in a defamation case as Balaji Bhakt.
కాగా, సుబ్రహ్మణ్యస్వామి ప్రకటన ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన ఏ మీడియా సంస్థపై పరువు నష్టం కేసును వేయాలనుకుంటున్నారన్న దానిపై ఆయన ట్విటర్ ఖాతా కింద కామెంట్ల వర్షం కురుస్తోంది. మరి సుబ్రహ్మణ్యస్వామి ఎవరిపై కేసును పెట్టబోతున్నారో? ఏం జరగబోతోందో? తెలియాలంటే కొద్ది రోజులు వేచిచూడాల్సిందే..
Published by:Hasaan Kandula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.