Home /News /andhra-pradesh /

MP RAMMOHAN NAIDU MEET WITH PRIME MINSTER MODI HE GAVE CHOCOLATE TO MP DAUGHTER NGS

MP Rammohan Naidu: టీడీపీ యువ ఎంపీతో ప్రధాని ముచ్చట్లు.. కూతురుకి చాక్లెట్లు ఇచ్చిన మోదీ సర్ ప్రైజ్

ప్రధాని మోదీతో ఎంపీ రామ్మోహన్ భేటీ

ప్రధాని మోదీతో ఎంపీ రామ్మోహన్ భేటీ

MP Rammohan Naidu: టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఆయన కుటుంబంతో సహా హస్తినలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ఆయన కుటుంబ సభ్యులతో కలసి ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన కుమార్తెకు చాక్లెట్లు ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు మోదీ.

ఇంకా చదవండి ...
  MP Rammohan Naidu: ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ప్రస్తుతం అన్ని పార్టీల ఎంపీలు దాదాపు ఢిల్లీలోనే ఉన్నారు. ఇదే సమయంలో సీఎం జగన్ (CM Jagan) సైతం ఢిల్లీ (Delhi)లోనే ఉన్నారు. ప్రధాని మోదీ (PM Modi)తో సమావేశమయ్యారు. అయితే అంతకుముందు ప్రధాని టీడీపీ యువ ఎంపీని కలిశారు. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో దేశ రాజధాని పొలిటికల్ లీడర్లతో సందడిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గత కొన్ని రోజులుగా యువ ఎంపీల కూతుళ్లను ఆప్యాయంగా
  పలకరిస్తున్నారు. తాజాగా టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు (MP Rammohan Naidu) తన భార్య, కూతురుతో కలిసి ప్రధాని మోదీని కలిశారు. అయితే ఈ సందర్భంగా.. ఎంపీ రామ్మోహన్‌ నాయుడు కుమార్తెను చూసి ప్రధాని కాసేపు ముద్దాడారు. చక్కగా ఉంది అంటూ పొగుడుతూ.. ఆ
  చిన్నారికి చాక్లెట్లు ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. దీంతో ప్రధాని తమ కుటుంబాన్ని రిసీవ్ చేసుకున్న విధానంపై ఎంపీ ఆనందం వ్యక్తం చేశారు. ఆ
  తరువాత.. మాట్లాడిన ఆయన.. ఏపీలో ప్రభుత్వం విధానాలపై నిప్పులు చెరిగారు.

  ముఖ్యంగా సీఎం జగన్ పాలనపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలు పెంచబోమని 2019
  ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల రూపంలో ప్రజలను దోచుకు తింటోందని
  మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని జగన్ ప్రభుత్వం కుదేలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే విద్యుత్ కోతలతో
  అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలపై జగన్ ప్రభుత్వం కరెంటు బిల్లుల మోతమోగిస్తుందని రామ్మోహన్ నాయుడు విమర్శించారు.

  ఇదీ చదవండి : ప్రధానితో ముగిసిన సీఎం జగన్ సమావేశం.. ఎంత సేపు.. ఏఏ అశాలపై చర్చించారంటే

  వైసీపీ ప్రభుత్వం ఒకే టార్గెట్ తో ఉందని.. అది ఎంతసేపు ప్రజల దగ్గర నుంచి డబ్బులు ఎలా లక్కోవాలి అనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి
  దగ్గర నుంచి మంత్రులంతా పనిచేస్తున్నారని ఆరోపించారు. అందుకనుగుణంగానే రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా కరెంటు చార్జీలు పెంచారని మండిపడ్డారు. ఇంత భారీగా విద్యుత్ చార్జీలు పెంచిన జగన్ రెడ్డి ప్రజలకు చేసే మేలు ఇదేనా అంటూ టీడీపీ ఎంపీ ప్రశ్నించారు. వెంటనే
  రాష్ట్రంలో పెంచిన విద్యుత్ చార్జీలను వెనక్కి తీసుకోవాలని రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన
  తరువాత.. ఇప్పటి వరకు కరెంట్ ఛార్జీల రూపంలోనే ప్రజలపై 42 వేల కోట్ల రూపాయల భారం మోపారని ఎంపీ  విమర్శించారు.

  ఇదీ చదవండి :మరోసారి మనసు టచ్ చేసిన సీఎం.. కాన్వాయ్ మధ్యలో 108కు దారిచ్చిన జగన్

  అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరంకు నిధులు సహా ఏఒక్కటీ సాధించలేని జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పూర్తిగా
  పోయిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమాన్ని రాష్ట్రంలోనూ ఢిల్లీలోనూ వైసీపీ నేతలు నీర్యిర్యం చేశారని ప్రధాని విమర్శించారు.
  విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై అందరం కలిసి రాజీనామాలు చేయాలనీ పిలుపునిచ్చామని.. కానీ వైసీపీ నేతలు స్పందించలేదన్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Pm modi, Rammohan naidu, TDP

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు