Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    కొత్త జిల్లాకు అల్లూరి పేరుపెట్టాలి.. జగన్‌కు ఎంపీ కృష్ణంరాజు లేఖ

    గత అసెంబ్లీ ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన జగన్‌ ఆ సమయంలో ఈ విషయంపై ప్రజలకు హామీ ఇచ్చారని రఘురామకృష్ణరాజు తెలిపారు.

    news18-telugu
    Updated: July 4, 2020, 1:34 PM IST
    కొత్త జిల్లాకు అల్లూరి పేరుపెట్టాలి.. జగన్‌కు ఎంపీ కృష్ణంరాజు లేఖ
    ఏపీ సీఎం వైఎస్ జగన్
    • Share this:
    ఆంధ్రప్రదేశ్ నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఆ పార్టీ నేతలకు మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసింది. ఇటీవల రఘురామకృష్ణంరాజు ఓ సందర్భంగా తాను జగన్ ఫొటోతో ఎంపీగా గెలవలేదని, తన ఫొటో పెట్టుకుని ఎమ్మెల్యేగా గెలిచారంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు, రఘురామకృష్ణంరాజుల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే అతడిపై అనర్హత వేటు వేయాలంటూ పార్లమెంటు స్పీకర్‌ను ఆ పార్టీ ఎంపీలు కలిశారు. అంతకుముందే ఎంపీ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ తాను పార్టీకి వ్యతిరేకంగా ఏలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ప్రజాసమస్యలు ప్రస్తావించిన వారిని సస్పెండ్ చేస్తే.. పార్టీలో ఎవరూ ఉండబోరంటూ పేర్కొన్నారు.

    తాను తిరుమల శ్రీవారి భూములు అమ్మోద్దని చెప్పానని, సీఎం జగన్ సైతం తర్వాత అదే నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌కు ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఓ లేఖ పంపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా పేరు పెట్టాలని కోరారు.

    ఈ మేరకు జగన్‌కు ఆయన రెండు రోజుల క్రితం రాసిన లేఖను ఆయన క్యారాలయం ఈ రోజు విడుదల చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన జగన్‌ ఆ సమయంలో ఈ విషయంపై ప్రజలకు హామీ ఇచ్చారని రఘురామకృష్ణరాజు తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం ఈ విషయంపై ఇప్పుడు సీఎం జగన్ అధికారికంగా ప్రకటన చేయాలని ఆయన కోరారు. కొత్త జిల్లాకు ఆ పేరు పెడితే ప్రజలు సంతోషపడతారని చెప్పారు.
    Published by: Narsimha Badhini
    First published: July 4, 2020, 1:34 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading