వారిని ఆదుకోండి... సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ

MP Raghurama Krishnam Raju | భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్‌కు లేఖ రాశారు.

news18-telugu
Updated: July 14, 2020, 2:16 PM IST
వారిని ఆదుకోండి... సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ
రఘురామకృష్ణంరాజు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఓ వైపు వైసీపీతో ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరిస్తున్న ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. మరోవైపు ప్రజాసమస్యలపై సీఎం జగన్‌కు తాజాగా లేఖ రాశారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని తన లేఖలో రఘురామకృష్ణంరాజు కోరారు. రాష్ట్రంలో 20లక్షల 64 వేల భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లు నమోదు చేయించుకున్నారని ఆయన తెలిపారు. వారిలో 10లక్షల 66 వేల మంది కార్మికుల పేర్లను మాత్రమే ఆధార్‌తో లింక్ చేశారని అన్నారు. మిగిలిన వారి పేర్లు వెంటనే లింక్ చేసేలా చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణంరాజు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్య కాలంలో బిల్డర్స్ నుంచి సంక్షేమ నిధి రూపేణా రూ. 1364 కోట్లు వసూలు చేసిందని తన లేఖలో ప్రస్తావించారు.

అయితే ఇప్పటి వరకూ రూ.330 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని రఘురామకృష్ణంరాజు వివరించారు. మిగిలిన వెయ్యి కోట్ల నిధుల నుంచి ఒక్కో భవన నిర్మాణ కార్మికుడికి రూ. 5 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందించాలని ఏపీ సీఎం జగన్‌కు రాసిన లేఖలో రఘురామకృష్ణంరాజు కోరారు.
Published by: Kishore Akkaladevi
First published: July 14, 2020, 1:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading