హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

నాకు ప్రాణహాని ఉంది.. లోక్‌సభ స్పీకర్‌కు వైసీపీ ఎంపీ లేఖ

నాకు ప్రాణహాని ఉంది.. లోక్‌సభ స్పీకర్‌కు వైసీపీ ఎంపీ లేఖ

రఘురామకృష్ణంరాజుకు చెందిన కంపెనీ కర్ణాటకలో పవర్ ప్లాంట్ కోసం రుణం తీసుకుని దాన్ని తమిళనాడులోని ట్యూటికోరన్‌కు తరలించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

రఘురామకృష్ణంరాజుకు చెందిన కంపెనీ కర్ణాటకలో పవర్ ప్లాంట్ కోసం రుణం తీసుకుని దాన్ని తమిళనాడులోని ట్యూటికోరన్‌కు తరలించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వమని బెదిరిస్తున్నారని, తన వ్యక్తిగత కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చెప్పారు. అందుకే కేంద్ర భద్రతా సిబ్బందితో రక్షణ కల్పించాలని విజ్ఞప్తిచేస్తున్నట్ల లేఖలో పేర్కొన్నారు నర్సాపురం ఎంపీ.

ఇంకా చదవండి ...

  ఏపీ రాజకీయాల్లో నర్సాపురం ఎంపీ రఘరామ కృష్ణంరాజు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ నేతలు, ఆయన మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సొంత పార్టీపైనే విమర్శలు చేయడం, బతిమిలాడడం వల్లే వైసీపీలో చేరానని ఇటీవల వ్యాఖ్యలు చేయడంతో..ఆయన తీరుపై సీఎం జగన్‌కు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. అంతేకాదు నర్సాపురంలో ఆయనకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో తనకు ప్రాణహాని ఉందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఎంపీ రఘు రామకృష్ణ రాజు లేఖ రాశారు. కేంద్ర భద్రతా సిబ్బందితో తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తిచేశారు.

  శ్రీవారి భూముల వేల విషయంలో సీఎం జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని.. అందుకే స్వామి వారి భక్తుడిగా తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నానని లేఖలో ఆయన పేర్కొన్నారు. అప్పటి నుంచి తన నియోజకవర్గంలో అలజడులు సృష్టిస్తున్నారని.. వ్యక్తిగత దాడులకు దిడుతున్నారని తెలిపారు. ఇసుక వ్యవహారంలో ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపినందుకు.. ఎమ్మెల్యేలతో విమర్శలు చేయిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు రఘురామ కృష్ణంరాజు. నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వమని బెదిరిస్తున్నారని, తన వ్యక్తిగత కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చెప్పారు. అందుకే కేంద్ర భద్రతా సిబ్బందితో రక్షణ కల్పించాలని విజ్ఞప్తిచేస్తున్నట్ల లేఖలో పేర్కొన్నారు నర్సాపురం ఎంపీ.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, AP News, MP raghurama krishnam raju, Ysrcp

  ఉత్తమ కథలు